ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. కాగా, వచ్చే సీజన్‌లో అయినా కప్ కలను నెరవేర్చుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అతిజాగ్రత్తగా ఆలోచించి ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ రూ.75 లక్షలను మిగుల్చుకుంది. అంతేగాక రెండు ఆర్‌టీఎమ్ కార్డ్‌లను వినియోగించుకోలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ ఎంపికలపై విమర్శలూ వచ్చాయి. అయితే రూ.8.75 కోట్లు వెచ్చించి ఆర్సీబీ కొనుగోలు చేసిన లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో బెంగాల్ టైగార్ తరఫున ఆడుతున్న ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో జట్టు ఒంటి చేత్తో గెలిపించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్లకు 126 పరుగులు చేసింది. ఆర్సీబీ రూ.3 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన టిమ్ డేవిడ్ 4 బంతుల్లో ఒక్క పరుగే చేశాడు. నిఖిల్ చౌదరి (47 నాటౌట్; 16 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. డేవిడ్ పైనే, జోస్ లిటిల్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో బెంగాల్ వారియర్స్ రెండు బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని సాధించింది. నాలుగో స్థానంలో వచ్చిన లివింగ్‌స్టోన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
.@liaml4893 take a bow 🤯⚡️
— T10 Global (@T10League) November 25, 2024
We have just witness something special at the Zayed Cricket Stadium Abu Dhabi 🔥
The fastest 5️⃣0️⃣ in the 2024 #AbuDhabiT10 coming off just 15 balls 😮💨#ADT10 #CricketsFastestFormat #InAbuDhabi pic.twitter.com/9qjpKCohT9
ఆర్సీబీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
లియామ్ లివింగ్ స్టోన్(రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్(రూ. 11.50 కోట్లు), జితేశ్ శర్మ(రూ. 11 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ. 12.50 కోట్లు), రసిక్ ధార్(రూ. 6 కోట్లు), సుయాశ్ శర్మ(రూ. 2.6 కోట్లు), కృనాల్ పాండ్యా(రూ. 5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ. 10.75 కోట్లు), స్వప్నిల్ సింగ్(రూ. 50 లక్షలు), టీమ్ డేవిడ్(రూ. 3 కోట్లు), రోమారియో షెఫర్డ్(రూ. 1.5 కోట్లు), నువాన్ తుషారా(రూ. 1.6 కోట్లు), మనోజ్(రూ. 30 లక్షలు), జాకోబ్ బెతెల్(రూ. 2.6 కోట్లు), దేవదత్ పడిక్కల్(రూ. 2 కోట్లు), స్వస్తిక్ చికార(రూ. 30 లక్షలు), లుంగి ఎంగిడి(రూ. కోటి), అభినందన్ సింగ్(రూ. 30 లక్షలు), మోహిత్ రతీ(రూ. 30 లక్షలు)
ఆర్సీ రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ(రూ. 21 కోట్లు), రజత్ పటీదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాల్(రూ. 5 కోట్లు).