Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్వాలిఫయర్-1లో గెలవాలంటే 2 మార్పులు చేయండి: ఆర్సీబీ మాజీ ప్రధాన కోచ్

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆప్స్ మే 29 నుంచి ప్రారంభమవుతున్నాయి. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముల్లన్‌పూర్‌లో తలపడనున్నాయి. మంగళవారం రాత్రి ఆర్సీబీ లక్నో జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-1లో తమ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్-1కి ముందు ఆర్సీబీ వారి ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేయాలని ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ జట్టుకు సలహా ఇచ్చారు.

ఆ 2 మార్పులు ఏంటంటే?
స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చ సందర్భంగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌లో నువాన్ తుషారాను కొనసాగించాలని సలహా ఇచ్చారు. దీనితో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్‌‌లను తిరిగి తీసుకురావాలని ఆయన సిఫార్సు చేశారు. ఆర్సీబీకి వ్యతిరేకంగా బలమైన పంజాబ్ కింగ్స్ జట్టు ఉందని.. వారు ఈ సీజన్లో ఆరు లేదు ఏడు సార్లు 200 పరుగుల మార్కును దాటిందని అన్నారు. విదేశీ బ్యాటర్‌గా ఆడుతున్న లివింగ్‌స్టోన్ ఈ సీజన్‌లో పరుగులు సాధించలేకపోతున్నాడని.. కాబట్టి ఆర్సీబీ వారి బౌలింగ్ ను పూర్తిగా బలోపేతం చేసుకోవాలని సూచించాడు. ఈ కలయికను తయారు చేయవచ్చని తాను భావిస్తున్నానన్నారు.

IPL 2025 RCB Must Make These 2 Changes to Win Qualifier-1 Sanjay Bangar s Key Advice

ఆర్సీబీ జట్టులోకి జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ లాంటి మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లు క్వాలిఫయర్-1లో తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. వారిద్దరు జట్టులో చేరితే ఆర్సీబీ మరింత బలంగా మారనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా 70వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌‌లో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో పాటు ఆర్సీబీ ప్రత్యర్థి జట్ల సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లను గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది.

Story first published: Wednesday, May 28, 2025, 17:02 [IST]
Other articles published on May 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+