Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB VS CSK: సీఎస్కే అభిమానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ దాడి..! (వీడియో వైరల్)

IPL 2025 CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచులోనూ కాదు.. ఈ సీజన్ మొత్తంలో అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకెళ్తోంది ఆర్సీబీ. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇదే సమయంలో సీఎస్కే.. ఈ సీజన్ లో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో సీస్కే అభిమానులు ఉసూరుమనగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇరు జట్ల మధ్య గొడవ..
అయితే ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా తాజాగా జరిగిన మ్యాచులో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడంతో బెంగళూరు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. మ్యాచు జరుగుతున్న సమయంలో ఓ వైపు సీఎస్కే స్లోగాన్స్ , మరోవైపు ఆర్సీబీ నినాదాలు పోటాపోటీగా వినిపించాయి. అప్పుడు మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్ల ఫ్యాన్స్ మధ్య ఘర్షణ నెలకొంది.

IPL 2025 RCB fans attack CSK fan on Bangalore street video goes viral

ఆర్సీబీ ఫ్యాన్స్ పై గుస్సా..
ఆర్సీబీ ఫ్యాన్స్.. సీఎస్కే ధరించిన ఓ అభిమానిని తిడుతూ కనిపించారు. అది కాస్త ఇరు జట్ల మధ్య గొడవగా మారిపోయింది. అప్పుడు ఓ పోలీస్ అధికారి వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకు.. "ఓ సీఎస్కే అభిమాని మ్యాచ్ అయిపోయాక యాటిట్యూడ్ చూపించాడు. కానీ వారికి ఆర్సీబీ ఫ్యాన్స్ బుద్ధి చెప్పారు" అని క్యాప్షన్ రాసి ఉంది. కానీ ఈ వీడియో చూశాక క్రికెట్ అభిమానులు.. ఆర్సీబీ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచు ముగిశాక అర్థరాత్రి 12.30 వరకు ఆర్సీబీ అభిమానులు రోడ్లపైకి వచ్చి రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు. వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ, గోల చేస్తూ.. జెండాలు ఊపుతూ, చేతులు ఊపుతూ ఆర్సీబీ ఆటగాళ్లను అభినందించారు. ఆటగాళ్ల బస్సు వెనకాల పరిగెడుతూ ఆర్సీబీ నినాదాలతో గోల గోల చేశారు.

Story first published: Sunday, May 4, 2025, 14:27 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+