For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీ టైటిల్ గెలవకపోతే భర్తకు విడాకులిస్తా: లేడీ అభిమాని(వీడియో)

IPL 2025: దాదాపు 9 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి తన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. 18వ సీజన్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గురువారం(మే 29) నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 10 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టుపై అద్భుత విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

ఈ సారి కప్పు ఖాయమని అటు ప్లేయర్లు, ఇటు ఆర్సీబీ అభిమానులు ధీమగా ఉన్నారు. ఇదిలా ఉండగా గురువారం జరిగిన మ్యాచ్ సమయంలో చాలా ఫన్నీ విషయం కనిపించింది. మైదానంలో ఉన్న ఒక మహిళ తన చేతిలో ఒక పోస్టర్ పట్టుకుని కనిపించింది. దానిపై"ఆర్సీబీ ఈ సారి టైటిల్ గెలవకపోతే నేను నా భర్తకు విడాకులు ఇస్తాను" అని రాసి ఉంది. ఇప్పుడు పోస్టర్‌తో ఉన్న ఆ మహిళ ఫోటో చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

IPL 2025 RCB fan promises divorce if the team doesn t win the title

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతంగా ఆడి ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే మూడు సార్లు ఫైనల్‌కు చేరి కప్పు గెలవకుండానే నిష్క్రమించింది. ఫైనల్ కు చేరడం దీంతో నాలుగో సారి. కానీ ఈ సారి ఆర్సీబీ జట్టు చరిత్ర సృష్టించి తొలి సారి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ.. 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ హోరా హోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

Story first published: Friday, May 30, 2025, 14:47 [IST]
Other articles published on May 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+