ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ భారీ స్కోర్ల మ్యాచ్ ఛేదనలో టైటాన్స్ దీటుగానే స్పందించినా.. ఆఖర్లో ఓటమి తప్పలేదు. ఎందుకంటే ఈ మ్యాచులో పంబాజ్.. బ్యాటింగ్ తో పాటు చివరి ఓవర్లలో అద్భతుమైన బౌలింగ్ తో మ్యాచ్ ను కాపాడుకుంది.
ఈ మ్యాచ్ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ కీలకంగా వ్యవహించారు. అయితే ఈ మ్యాచ్ ను పంజాబ్ వైపు మలుపు తిప్పింది హీరో మాత్రం వైశాఖ్ విజయ్ కుమార్. ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వైశాఖ్ విజయ్ కుమార్.. ఆఖర్లో తన బౌలింగ్‍తో మ్యాచ్‍ను మలుపుతిప్పి ఒక్క వికెట్ తీయకుండానే హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడతడు.. ఆర్సీబీకి తలనొప్పిగా మారాడు. అతడి కారణంగా ఆర్సీబీని ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఎందుకంటే
పంజాబ్ కింగ్స్ బౌలర్ వైశాఖ్ విజయ్‍కుమార్.. గత రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. కానీ కర్ణాటకకు చెందిన ఈ బౌలర్ ను.. ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కనీసం వేలంలో కూడా దక్కించుకోలేదు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. ఇప్పుడేమో అతడు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విన్నింగ్ బౌలర్ గా మారాడు. అందుకే ఇంత అద్భుతమైన బౌలర్‌ను ఎలా వదిలేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ఆర్సీబీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కాగా, తాజాగా జరిగిన మ్యాచులో 15వ ఓవర్లో ఎంట్రీ ఇచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్.. వైడ్ యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అస్సలు ఎక్కడ కూడా హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. 15వ ఓవర్లో కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్‍ను పంజాబ్‍వైపునకు తిప్పాడు. ఇక 17వ ఓవర్లోనూ మూడు వైడ్లు వేసినా.. ఐదు పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో వైశాఖ్ 18 పరుగులు ఇచ్చినప్పటికీ... కీలకమైన 15, 17 ఓవర్లలో చెరో ఐదు పరుగులే ఇచ్చి మ్యాచును పంజాబ్ వైపు తిప్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.