CSK VS RCB: ఐపీఎల్ 2025.. సీఎస్కేను బీట్ చేసిన ఆర్సీబీ!!
CSK VS RCB: ఐపీఎల్.. ఒకరిది ఐదు టైటిళ్లు సాధించిన ఘనత.. మరొకరిది ఒక్క టైటిల్ కూడా గెలవలేని చరిత్ర. వాళ్లే సీఎస్కే - ఆర్సీబీ. క్రికెట్ వర్గాల్లో ఈ రెండు జట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ రెండు జట్లలో ఎవరు గొప్ప అనే చర్చ క్రికెట్ ఫ్యాన్స్ లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. క్రేజ్ విషయంలో సీఎస్కే సాధించిన రికార్డును బ్రేక్ చేసింది.
రికార్డ్ ఇదే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఏళ్ల చరిత్రలోనే ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ జట్టు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం ప్రతి ఏటా పెంచుకుంటూనే పోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అస్సలు తగ్గట్లేదు. తాజాగా ఇన్ స్టాలో ఓ రికార్డును అందుకుంది. 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో 17.8 మిలియన్ మంది ఫాలోర్స్ ను సంపాదించుకుంది. ఇప్పటివరకు 17.7 మిలియన్ మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేది సీఎస్కే. ఇప్పుడా రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. దీంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఆర్సీబీ అభిమానుల సంబరాలు..
'సీఎస్కే రెండు సార్లు ఓడిపోయింది, ముంబయి రెండు సార్లు ఓడింది, ఆర్సీబీ రెండు సార్లు గెలిచింది, ఇప్పుడు సీఎస్కేను ఇన్ స్టాలో బ్రేక్ చేసింది.. అంటే ఈ సీజన్ లో ఆర్సీబీ టైటిల్ సాధించనుందని చెప్పడానికి సంకేతాలు', 'మాకు ఐదు ట్రోఫీలు అక్కర్లేదు పెద్ద జట్టుగా అవతరించడానికి', 'మరో ట్రోఫీ సంపాదిస్తే ఆర్సీబీ అవలీలగా 20 మిలియన్ మంది ఫాలోవర్ల మార్క్ ను రీచ్ చేస్తుంది' అని రాసుకొస్తున్నారు.
ముంబయి, సీఎస్కే కౌంటర్..
దీనికి ఓ ముంబయి ఇండియన్ ఫ్యాన్ కౌంటర్ అటాక్ చేశాడు. 'గత 18 ఏళ్లలో మీరు సాధించింది ఇదొక్కటేలే' అంటూ ఆర్సీబీ అభిమానికి చురకలంటించాడు. మరో సీఎస్కే అభిమాని.. 'ఫాలోవర్స్ 17.8 మిలియన్లు, ట్రోఫీలు 0.00' అంటూ రాసుకొచ్చారు.
- ఇతర జట్ల ఫాలోవర్ల ఎంతమందంటే?
- ముంబయి ఇండియన్స్ - 16.2 మిలియన్ ఫాలోవర్స్
- కోల్‌కతా నైట్ రైడర్స్ - 7 మిలియన్ ఫాలోవర్స్
- సన్‌రైజర్స్ హైదరాబాద్ - 5.1 మిలియన్ ఫాలోవర్స్
- రాజస్థాన్ రాయల్స్ - 4.7 మిలియన్ ఫాలోవర్స్
- గుజరాత్ టైటాన్స్ - 4.5 మిలియన్ ఫాలోవర్స్
- దిల్లీ క్యాపిటల్స్ - 4.3 మిలియన్ ఫాలోవర్స్
- పంజాబ్ కింగ్స్ - 3.7 మిలియన్ ఫాలోవర్స్
- లక్నో సూపర్ జెయింట్స్ - 3.5 మిలియన్ ఫాలోవర్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications