Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించే దిశగా రవీంద్ర జడేజా!

Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నేడు(ఫిబ్రవరి 25) జరగనుంది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దారుణంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల ప్రయాణం ప్లేఆఫ్స్ నుంచి దాదాపు ముగిసింది. అయితే సన్‌రైజర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీస్తే డ్వేన్ బ్రావో రికార్డును అధిగమించి రికార్డును సృష్టించనున్నాడు.

చరిత్ర సృష్టించనున్న జడేజా
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా 180 మ్యాచ్‌ల్లో 138 వికెట్ల పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. సీఎస్కే తరఫున డ్వేన్ బ్రావో 140 వికెట్లు పడొట్టాడు. ఇప్పుడు రవీంద్ర జడేజాకు బ్రావోను అధిగమించే అవకాశం ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మరో మూడు వికెట్లు తీస్తే సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు. ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా ప్రదర్శన చాలా బాగుంది. జడేజా జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో జడేజా ఎలా రాణిస్తాడో, బ్రావోను మించి రాణించగలడో లేదో వేచి చూడాల్సిందే.

IPL 2025 Ravindra Jadeja on the Verge of Breaking Bravo s CSK Bowling Record

రవీంద్ర జడేజా ఐపీఎల్ కెరీర్ ఎలా ఉందంటే..
ఇప్పటివరకు రవీంద్ర జడేజా ఆడిన 248 ఐపీఎల్ మ్యాచ్‌‌లలో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజా 27.45 సగటుతో 3104 పరుగులు చేశాడు. ఇదే కాకుండా బౌలింగ్‌లో 165 వికెట్లు పడగొట్టాడు. 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 21.45 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇది కాకుండా బౌలింగ్ లో 54 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్ 2025లో రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో లేకపోవడం గమనార్హం.

ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
ప్రసిద్ధ్ కృష్ణ- 16
హేజిల్ వుడ్-16
ఆర్.సాయికిషోర్-12
నూర్ అహ్మద్ - 12
కుల్దీప్ యాదవ్ - 12
హార్దిక్ పాండ్యా-12
కృనాల్ పాండ్యా -12
మహ్మద్ సిరాజ్ -12
శార్దూల్ ఠాకూర్-12
హర్షిత్ రాణా -11

Story first published: Friday, April 25, 2025, 16:52 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+