Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా.. కారణమిదే!

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబైని ఓడించింది. అయితే మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా విధించబడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు బౌలింగ్ చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. దీని కారణంగా ఆర్సీబీ కెప్టెన్ బాధపడాల్సి వచ్చింది. స్లో ఓవర్ రేట్ కింద రజత్ పాటిదార్ కు ఐపీఎల్ కౌన్సి రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2 ప్రకారం రజత్ పాటిదార్ కు ఈ జరిమానా విధించబడింది.

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం
ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(4) వెంటనే వినుదిరగగా.. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేసిన అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. రజత్ పాటిదార్ 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

IPL 2025 Rajat Patidar Fined for Slow Overrate in RCB vs MI Match

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబై తీవ్రంగా పోరాడింది. కానీ ఆ జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 17 పరుగులు చేయగా.. ర్యాన్ రికెల్టన్ కూడా 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 28 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులతో అద్భుతమే చేశాడు.

పాటిదార్ అద్భుతమైన కెప్టెన్సీ
ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ తమ కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను నియమించింది. రజత్ పాటిదార్ ఇప్పటివరకు తన అద్భుతమైన కెప్టెన్సీతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో ఆర్సీబీ 3 గెలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి విజయవంతమైన జట్లను ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, April 8, 2025, 13:22 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+