Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అడుక్కుంటేనో, డబ్బులు పెట్టి కొంటేనో ఇది రాదు!

Rohit Sharma Akash Madwval: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఏకంగా 100 పరుగులు తేడాతో గెలుపొంది, ఈ సీజన్ లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి.. ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. అయితే ఈ మ్యాచ్ పూర్తయ్యాక ఓ అద్భుతమైన దృశ్యం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్.. ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, అతడి భార్య రితికా సజ్దేతు చేతులెత్తి నమస్కరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వాస్తవానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మధ్వాల్ ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఆడాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అందుకే ఈ మ్యాచులో రోహిత్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చేతల రూపంలో చూపించాడు. అందరి ముందే మైదానంలోనే రోహిత్ కు రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. ఆ వెంటనే రోహిత్.. స్టాండ్స్ లో ఉన్న తన భార్య రితికాను మధ్వాల్ కు చూపించగా.. అప్పుడు కూడా మధ్వాల్ ఎంతో వినయంగా ఆమెకు కూడా చేతులతో నమస్కరించాడు.

IPL 2025 Rajasthan Royals player Akash Madhwal greets with folding hands for Rohit Sharma Ritika

అనంతరం మరో స్వీట్ గెస్టర్ కూడా చోటు చేసుకుంది. మధ్వాల్.. తన ఆర్ఆర్ జెర్సీపై ఆటోగ్రాఫ్ ను అడిగాడు. దానికి రోహిత్ ఎంతో సంతోషంగా జెర్సీపై సంతకం చేశాడు. అలా ఈ రెండు సంఘటనలు క్రికెట్ అభిమానులను మనసులను హత్తుకున్నాయి. 'గౌరవం అంటే ఇది, రోహిత్ దాన్ని సంపాదించుకున్నాడు', 'ఎవ్వరూ కూడా దీనిని డబ్బులు పెట్టి కొనలేరు', 'అడుక్కుంటే వచ్చేది కాదు ఈ గౌరవం', 'మా రోహిత్ భయ్యా జెంటిల్ మెన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలానే ఇంకొంతమంది ఫన్నీ కామెంట్లు కూడా చేశారు. 'నేను రాజస్థాన్ రాయల్స్ లో అనవసరంగా వచ్చి ఇరుకున్నాను రోహిత్ భయ్యా, నన్ను తీసుకెళ్లిపో' అంటూ మధ్వాల్ రోహిత్ తో అంటున్నారు పోస్టులు పెడుతున్నారు.

ఆకాశ్ మధ్వాల్ ను 2025 మెగా ఆక్షన్ లో రూ.1.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కానీ అతడికి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఇచ్చింది. అది కూడా తన మాజీ టీమ్ ముంబై ఇండియన్స్ పై ఆడాడు. కానీ రాణించలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Story first published: Friday, May 2, 2025, 13:48 [IST]
Other articles published on May 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+