Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మొదలైన ద్రవిడ్ వ్యూహాలు..రాజస్థాన్‌లో మరో ప్రపంచకప్ విజేత

ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన వ్యూహాలు మొదలుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌ను బలోపేతం చేయడానికి చర్యలు వేగవంతం చేశాడు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో తనతో పాటు కీలక పాత్ర పోషించిన మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను రాజస్థాన్ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాడు. ద్రవిడ్ సూచన మేరకు విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా రాజస్థాన్ రాయల్స్ నియమించింది.

ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్‌కు విక్రమ్ రాథోడ్ వస్తున్నాడని వెల్లడించింది. కొత్త బాధ్యతలపై విక్రమ్ స్పందించాడు. రాయల్స్ ఫ్యామిలీలో భాగమవ్వడం సంతోషంగా ఉందని తెలిపాడు. ద్రవిడ్‌తో కలిసి మళ్లీ పనిచేయడం, యువ క్రికెటర్లతో ముందకు వెళ్లడం ఉత్తేజకరంగా ఉందని అన్నాడు. టీమ్ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తానని, టాప్ క్లాస్ ప్లేయర్లను రాజస్థాన్ రాయల్స్‌కు, భారత్‌కు అందింస్తూ ఛాంపియన్స్‌గా నిలవడమే తమ లక్ష్యమని విక్రమ్ పేర్కొన్నాడు.

IPL 2025 Rajasthan Royals Appoint Vikram Rathour as Batting Coach

టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా‌కు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. 2012లో విక్రమ్ జాతీయ సెలక్టర్‌గానూ సేవలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేలా బ్యాటర్లను సిద్ధం చేయడంలో విక్రమ్ రాథోడ్ సిద్ధహస్తుడు. అందుకే విక్రమ్‌ను ద్రవిడ్ తన సహాయక బృందంలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్ తరఫున విక్రమ్ ఆరు టెస్టులు ఆడాడు.

గతంలో తాను కోచ్‌గా పనిచేసిన రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ మరోసారి బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నద్రవిడ్ రాజస్థాన్ కోచ్‌గా తన యాక్షన్ మొదలుపెట్టాడు. 2011 నుంచి 2015 మధ్య రాజస్థాన్‌కు కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్‌ వ్యవహరించాడు. 2013లో ఆటకు గుడ్‌బై చెప్పి 2014 నుంచి పూర్తిగా కోచింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.కాగా, గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. క్వాలిఫైయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.

Story first published: Friday, September 20, 2024, 13:42 [IST]
Other articles published on Sep 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+