Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: జట్టులోకి సంజూ శాంసన్ ?.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్‌డేట్

IPL 2025: సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2025లో దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల లాగే ఆరు మ్యాచ్‌లలో పరాజయాలను చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అంతగా రాణించడం లేదు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఈ సారి అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సంజు శాంసన్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. గాయం కారణంగా సంజూ శాంసన్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నేడు రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఆరోగ్య పరిస్థితి గురించి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు.

సంజూ శాంసన్ ఆరోగ్యంగా లేడని.. వైద్య బృందం తనకు ఆడటానికి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. సంజూ శాంసన్ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్ లు ఆడాడు. సగటున 30 కన్నా ఎక్కువ పరుగులతో 140 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినట్లు రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో చెప్పాడు. సంజూ శాంసన్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆడలేకపోయాడని.. ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడడానికి వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

IPL 2025 Rahul Dravid Shares Key Update on Sanju Samson s Injury

సంజూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాం..
సంజూ శాంసన్ ఎందుకు ఆడడం లేదో కూడా ద్రవిడ్ వివరించాడు. వైద్యుల సలహా ప్రకారం వచ్చే మ్యాచ్‌లలో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పాడు. ఫిజియోను కూడా సంజూ శాంసన్ తో ఉంచామని తద్వారా అతడినికి చికిత్స జరుగుతోందన్నారు. వీలైనంత త్వరగా సంజూ కోలుకునేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. సంజూ ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నామన్నారు. సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి ఎప్పుడు చేరతాడనేది చెప్పలేమని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. నేడు ఆర్సీబీతో రాజస్థాన్ జట్టు తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్ జట్టుతో మ్యాచ్ ఆడనుంది. మే 1న సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, April 24, 2025, 15:51 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+