For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా జట్టు ఓటమికి వాళ్లే కారణం: రాహుల్ ద్రవిడ్

RR vs PBKS: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 10 ఓటములను చవిచూసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు పదో ఓటమిని చవిచూసింది. అది కూడా కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అనేక మ్యాచ్‌లలో గెలుపుకు దగ్గరగా వచ్చారు కానీ పరాజయాలను ఎదుర్కొన్నారు.

ఈ పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నాడు. ఈ పరాజయాలకు బౌలింగ్‌ను నిందించాడు. ఈ పరిస్థితి బ్యాటర్ల వల్ల కాదని.. బౌలర్ల వల్లే వచ్చిందని ద్రవిడ్ సంచలన ప్రకటన చేశాడు. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమి తర్వాత రాహుల్ ద్రవిడ్ జట్టు పరిస్థితిని వివరించాడు. కేవలం బ్యాటర్లను మాత్రమే నిందించడంలో అర్థం లేదని.. బౌలర్లు కూడా దానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే తాము 20 పరుగులు ఎక్కువగా ఇచ్చినట్లు వెల్లడించాడు. లక్ష్యం 195 లేదా 200 పరుగులు ఉంటే అలవోకగా చేసి ఉండేవాళ్లమన్నాడు. రాజస్థాన్ విజయానికి చాలా దగ్గరగా వచ్చిందని.. కానీ ఛేదనను విజయవంతంగా పూర్తి చేయలేకపోయామన్నాడు. ఈ సిరీస్ అంతటా తాము 15 లేదా 20 అదనపు పరుగులు వదులుకున్నామని తాను అనుకుంటున్నట్లు చెప్పకొచ్చాడు.

IPL 2025 Rahul Dravid Blames Rajasthan Royals Bowling for Loss Against Punjab Kings

తాము చాలా మ్యాచ్‌లలో గెలవడానికి దగ్గరగా వచ్చి ఓడిపోయమన్నాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు భారీ షాట్లను కొట్టలేకపోయారని పేర్కొన్నాడు. 5 మ్యాచ్‌లను చాలా తక్కువ తేడాతో ఓడిపోయామన్నారు. తాము పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో చాలా వికెట్లు కోల్పోయామని చెప్పలేమని.. ఈ రోజు మ్యాచ్‌లో తాము కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయామన్నారు. కానీ మేము ఆ షాట్లు కొట్టలేకపోయామని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

Story first published: Monday, May 19, 2025, 14:23 [IST]
Other articles published on May 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+