Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: 11 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన క్వింటన్ డికాక్

IPL 2025: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న క్వింటన్ డికాక్ అజేయంగా 97 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. డికాక్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో డికాక్ సెంచరీ పూర్తి చేయలేకపోయినా 11 ఏళ్ల నాటి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

మనీష్ పాండే రికార్డును బ్రేక్ చేసిన క్వింటన్ డికాక్
రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్ లో క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేశాడు. డికాక్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. డికాక్ సెంచరీ సాధించలేకపోయినా కానీ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో క్వింటన్ డికాక్ 2014 ఫైనల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ఇప్పుడు పంజాబ్ కింగ్స్)తో జరిగిన మ్యాచ్‌లో మనీష్ పాండే నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు. ఇప్పుడు క్వింటన్ డికాక్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పరుగుల వేటలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 2014 ఫైనల్ లో మనీష్ పాండే 94 పరుగులు చేశాడు. మనీష్ పాండే ఇన్నింగ్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ పేరిట నమోదైంది.

IPL 2025 Quinton de Kock Breaks 11-Year-Old Record with Stunning 97 Runs

పరుగుల వేటలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అత్యధిక స్కోరు
క్వింటన్ డికాక్ : 97 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్, 2025
మనీష్ పాండే: 94 పరుగులు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ఇప్పుడు పంజాబ్ కింగ్స్), 2014
క్రిస్ లిన్ : 93 పరుగులు vs గుజరాత్ లయన్స్, 2017
మన్వీందర్ బిస్లా: 92 పరుగులు vs సీఎస్కే, 2013
గౌతమ్ గంభీర్: 90 పరుగులు vs సన్ రైజర్స్ హైదరాబాద్, 2016

మ్యాచ్ పరిస్థితి ఇలా..
అస్సాంలోని గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ అద్భుతంగా రాణించి రాజస్థాన్ రాయల్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అజింక్యా రహానే కెప్టెన్సీలో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌.. తన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 151/9 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌.. 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సులభమైన విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Thursday, March 27, 2025, 7:48 [IST]
Other articles published on Mar 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+