Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. ఇరు జట్లలో కీలక మార్పులు

MI vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు ప్రయాణం ఇప్పటివరకు చాలా బాగుంది. ఇరు జట్లు ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇరు జట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశాయి.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, "ఇది మంచి పిచ్‌లా కనిపిస్తోంది. టాస్ ఓడడం మాకు మంచిదే. మేము మొదట బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా పెద్ద తేడా లేదు. ఇవాళ కొన్ని పరుగులు చేసి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నాం. జట్టులో ఒక మార్పు జరిగింది. జట్టులోకి అశ్వనీ కుమార్ వచ్చాడు." అని చెప్పాడు.

IPL 2025 Punjab Wins Toss Opts to Bowl First Against Mumbai in High-Stakes Clash

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, "మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మాటలకంటే చర్యలు ఎక్కువ చెప్పాలి. నేను ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇస్తాను, కానీ వారే తమ ఆటతో ఆ ప్రేరణను కార్యరూపం దాల్చాలి. అలాగే ఈ మ్యాచ్ లో కైల్ జేమిసన్, వైశాఖ్ జట్టులోకి వచ్చారు. ప్రతి మ్యాచ్‌ను ఒకేలా తీసుకోవడం కుదరదు. మన మైండ్‌సెట్, ఆటను కూడా అప్‌డేట్ చేసుకోవాలి. " అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ విశాక్, అర్ష్‌దీప్ సింగ్.

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, ముషీర్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు

Story first published: Monday, May 26, 2025, 19:31 [IST]
Other articles published on May 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+