శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అంతా అతడి గురించే చర్చ. అందుకు కారణం.. తాజాగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటైన్స్ తో జరిగిన మ్యాచులో.. జట్టు కోసం 97 పరుగుల వద్ద సెంచరీని త్యాగం చేయడమే. దీంతో అందరూ అతడి బ్యాటింగ్ తీరుతో పాటు నాయకత్వ లక్షణాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అయ్యర్ మేటి క్రికెటర్ మాత్రమే కాదు స్టైలిష్ క్రికెటర్ కూడా. లగ్జరీ లైఫ్ కూడా గడుపుతుంటాడు. అందుకే ప్రస్తుతం అతడి ఆటతీరుతో పాటు అతడి లగ్జరీ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీ క్రికెట్, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా బానే ఆర్జిస్తున్నాడు. అయితే ఆ మధ్య అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ను తొలిగించింది బీసీసీఐ. అయినప్పటికీ అతడు ఐపీఎల్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. తొలిసారి 2015 ఐపీఎల్ సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2018కి రూ.7కోట్లకు పెరిగింది. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు అతడిని దక్కించుకుంది. జట్టుకు కెప్టెన్ ను చేసింది.
శ్రేయస్ అయ్యర్ టాప్ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు కూడా చేస్తున్నాడు. బోట్, డ్రీమ్ 11, సీట్, గూగుల్ పిక్సల్ సహా పలు సంస్థలకు బ్రాండ్ అంబాజిడర్ గా ఉంటున్నాడు. వీటి ద్వారా కూడా అతడికి బోలెడంత డబ్బు వస్తోంది. శ్రేయస్ అయ్యర్ సీ వ్యూ లగ్జరీ హౌస్ కూడా ఉంది. 2020లో ముంబయి లోథా వరల్డ్ టవర్ లో 4 బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. దాదాపు రూ.11.58 కోట్లకు దీనిని సొంతం చేసుకున్నాడు. అయ్యర్ దగ్గర లగ్జరీ కారు కలెక్షన్ కూడా ఉంది. అందులో రూ.2.45 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ G63 AMG, లంబోర్గిని (రూ.3కోట్లు), ఆడీ కార్లు ఉన్నాయి. మొత్తంగా అతడి నెట్ వర్త్ రూ.58 కోట్లు ఉంటుందని ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది. ఇది అధికర లెక్కలు కాదు.
