క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను వెల్లడిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్‌లకు అవకాశం ఇచ్చింది.
స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, యువ బ్యాటర్-అన్‌క్యాప్డ్ ప్లేయర్ అశుతోష్ శర్మలకు కూడా రిటైన్ లిస్ట్‌లో అవకాశం ఇవ్వలేదు. స్టాండ్ బై కెప్టెన్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను కూడా పంజాబ్ కింగ్స్ పక్కనపెట్టింది. అన్ని ఫ్రాంచైజీలలో అత్యధిక మిగులు పర్స్ వ్యాల్యూ రూ. 110.50 కోట్లతో పంజాబ్ ఫ్రాంచైజీ మెగా వేలంలోకి వెళ్లనుంది. నయా కోచ్ రికీ పాంటింగ్ జట్టును కొత్తగా నిర్మించడానికి ఇద్దరి ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే పంజాబ్ కింగ్స్‌కు మెగా వేలంలో నాలుగు ఆర్‌టీఎమ్ కార్డ్‌లు అవకాశం ఉన్నాయి. ఇతర ఫ్రాంచైజీలు బిడ్ చేసుకున్నా నలుగురిని అదే మొత్తం వెచ్చించి పంజాబ్ సొంతం చేసుకోవచ్చు. 17 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగులుతున్న పంజాబ్ కింగ్స్‌కు ఈ సారి అయినా తన రాతను మార్చుకుంటుందేమో చూడాలి.
పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్:
శశాంక్ సింగ్- రూ.5.5 కోట్లు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్- రూ.4 కోట్లు
రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ.9.50 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ.110.50 కోట్లు
పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
అశుతోష్ శర్మ, అర్షదీప్ సింగ్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, రిలే రోసో, తనయ్ త్యాగరాజన్, హర్‌ప్రీత్ సింగ్, విద్వాత్ కవెరప్ప, సికందర్ రజా, నాథన్ ఎలిస్, శివమ్ సింగ్, క్రిస్ వోక్స్, రిషి ధావన్, అథర్వ, ప్రిన్స్ చౌదరి, విశ్వనాథ్ సింగ్.