శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం అంతా అతడి పేరే మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ అతడి పేరు, ఏ క్రికెట్ అభిమాని చర్చించిన ఇతడి గురించే, ఏ మాజీ క్రికెటర్ మాట్లాడిన అతడిపై ప్రశంసలే. అందుకు కారణం.. తాజాగా గుజరాత్ టైటైన్స్ తో జరిగిన మ్యాచులో.. జట్టు కోసం 97 పరుగుల వద్ద సెంచరీని త్యాగం చేయడమే. దీంతో ప్రతీఒక్కరూ శ్రేయస్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు కోసం ఆడడంతో, అతడి నాయకత్వ లక్షణాలను పొగుడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా కూడా, శ్రేయస్ అయ్యర్ ను కొనియాడింది.
కొంతకాలం నుంచి దూరంగా..
ప్రీతి జింటా గురించి అటు సినీ అభిమానులకు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె.. ఐపీఎల్‌లో మాత్రం పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ బాధ్యతలు చూసుకుంటోంది. ఆ జట్టుకు ఓనర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఈ యాపిల్ బ్యూటీ.. తాజాగా తన జట్టుకు భారీ విజయాన్ని అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. అలానే అతడు సెంచరీని మిస్ చేయడంపై కూడా మాట్లాడింది.
టేక్ ఏ బౌ...
"అసాధారణమైన శుభారంభం. కొన్ని సార్లు సెంచరీలు కన్నా 97 చాలా బెటర్ గా ఉంటాయి. శ్రేయస్ అయ్యర్ నీ క్లాస్ ఇన్నింగ్స్, నాయకత్వ లక్షణాలు, దూకుడుతనానికి టేక్ ఏ బౌ. జట్టు మొత్తంగా సమిష్టిగా ఆడి జట్టుకు విజయాన్నందించడం చాలా ఆనందంగా ఉంది. అలానే విజయ్ కుమార్ వైశాఖ్, ప్రియాంశ్ ఆర్య, మార్కో జాన్సన్, శశాంక్ ప్రతిఒక్కరూ అద్భుతంగా ఆడారు." అంటూ రాసుకొచ్చింది. ఇంకా జట్టు ఆటగాళ్ల గ్రూప్ ఫొటోస్ ను షేర్ చేసింది.
