Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: 'పంజాబీ ముండా'పై ప్రేమను కురిపించిన ప్రీతి జింటా

Preity Zinta Praises Abhishek Sharma: శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో పరుగుల తుఫాన్ కనిపించింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేసి పంజాబ్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. తన సెంచరీ పూర్తి చేసిన తర్వాత అభిషేక్ శర్మ దానిని ప్రత్యేకంగా జరుపుకున్నాడు. అనంతరం జేబులో నుంచి ఓ పేపర్ తీసి.. అందరికి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.

అభిషేక్ స్టైల్లోనే..

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరెంజ్ ఆర్మీని మాత్రమే కాకుండా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాను కూడా సంతోషపెట్టింది. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ నుంచి వచ్చిన వాడే కావడం గమనార్హం. ఈ విధంగా ప్రీతి జింటా తన ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల పిచ్చిగా మారింది. మ్యాచ్ తర్వాత ప్రీతి జింటా అభిషేక్ ను కలవడమే కాకుండా.. అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభిషేక్ తరహాలో వేడుకను కూడా చేసింది. మైదానంలో కనిపించిన ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

IPL 2025 Preity Zinta Praises Abhishek Sharma After His Explosive Century Against PBKS

ప్రీతి జింటా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా అభిషేక్ ను ప్రశంసిస్తూ ఒక పోస్టును కూడా పంచుకున్నారు. ఆ పోస్టులో "ఈ రాత్రి అభిషేక్ శర్మ పేరిట ఉంది. ఎంత ప్రతిభ, అద్భుతమై ఇన్నింగ్స్. ఎస్ఆర్‌హెచ్ కు అభినందనలు! ఈ రాత్రిని మర్చిపోయి ముందుకు సాగడం మనకు మంచిది. ఇది టోర్నమెంట్ ప్రారంభం, ఇలాంటి మ్యాచ్ ల నుంచి మనం నేర్చుకుని ముందుకు సాగాలి." అని ప్రీతి జింటా రాసుకొచ్చారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ పంజాబ్ కింగ్స్ బౌలర్లను చిత్తు చేశాడు. పంజాబ్ పై కేవలం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ కేవలం 18.3 ఓవర్లలో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకుంది.

పంజాబ్ జట్టును ప్రశంసించిన ప్రీతి జింటా
ఈ మ్యాచ్ లో పంజాబ్ 245 పరుగులు చేసి ఓడిపోయినప్పటికీ జట్టు యజమాని ప్రీతి జింటా తన జట్టును ప్రశంసించింది. "శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టొయినీస్ ల అద్భుతమైన ప్రయత్నాలకు అభినందనలు" అంటూ ప్రీతి జింటా ట్వీట్ చేశారు. వారు అంత బాగా ఆడినందుకు తాను గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. తదుపరి మ్యాచ్ ల్లో మేము మరింత బలంగా తిరిగి వస్తామని తనకు ఉందని ప్రీతి జింటా అన్నారు.

Story first published: Sunday, April 13, 2025, 14:17 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+