PBKS VS KKR: చాహల్ - ప్రీతి జింటా.. వీడియో అదిరింది!
Chahal: ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా అదిరే విజయాన్ని అందుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని, 16 పరుగులు తేడాతో గెలిచి సంచలన రికార్డును అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. అయితే ఈ సంచలన విజయానికి ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ చాహల్.
మొదటి ఐదు మ్యాచులు తుస్సు..
చాహల్ ను.. పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇప్పటివరకు (కేకేఆర్ పై మ్యాచ్ మినహా) ఐదు మ్యాచులు ఆడింది. అందులో చాహల్ తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ ఇప్పుడు కేకేఆర్ పై విజయంలో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటాడు.

ఇప్పుడు ఏకంగా 4..
తన మణికట్టు స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ను గట్టిగా దెబ్బ తీశాడు. అతడి దెబ్బకు.. నాలుగు కీలక వికెట్లు కెప్టెన్ అజింక్య రహానే (17) రఘువంశీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. పెవిలియన్ బాట పట్టాయి. 8,10 ఓవర్లలో తొలి రెండు వికెట్లు తీయగా.. 12న ఓవర్లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఇతర పంజాబ్ బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేసి కేకేఆర్ ను పడగొట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలైపోయాయి. జట్టు యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో ఎగురుతూ, గంతులేస్తూ, కేరంతలు కొడుతూ తెగ సంతోషపడిపోయారు.
చాహల్ ను గట్టిగా హత్తుకుని..
ఈ క్రమంలోనే పంజాబ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన చాహల్‌ను గట్టిగా హత్తుకుని అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మ్యాచులో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) నామమాత్రపు పరుగులు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. దీంతో 15.3 ఓవర్లలోనే 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయిపోయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలోనే 95 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో 16 పరుగులు తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications