For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: అనుకున్నదొకటి.. అయినదొకటి.. టాప్-3లో ఊహించని జట్లు!!

IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులు పూర్తైపోయాయి. అయితే ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచులో ఆర్సీబీ విజయంతో మొదలైన తారుమారు అంచనాలు, ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. అంచనాలు లేని జట్లు అంతకుమించి ప్రదర్శన చేస్తుంటే... భారీ అంచనాలతో అభిమానులను మురిపించిన జట్లు తుస్సుమంటున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టిక ఆసక్తిగా మారిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక్క ట్రోఫీ కూడా గెలవని జట్లు.. టాప్ 3 స్థానాలను దక్కించుకోవడం విశేషం.

తాజాగా జరిగిన 13వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ను పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకుంది. దీంతో ఇప్పుడు పాయింట్ల పట్టిక రసవత్తరంగా మారిపోయింది.

IPL 2025 Points table Unexpected as RCB PBKS Delhi capitals in top 3 which never won ipl trophy

పాయింట్ల పట్టిక ఇదే...
గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచులు ఆడి ఒక్క విజయంతో రెండు పాయింట్లను దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఆరు స్థానాల్లో (5 నుంచి 10) ఉన్న జట్లు చెరో మూడు మ్యాచులు ఆడి అందులో ఒక్క విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. ఈ ఆరు జట్లతో లక్నో మాత్రమే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. మిగతా జట్లు ట్రోఫీ విన్నర్లుగా నిలిచాయి.

బడా జట్లు ఆఖర్లో..
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విన్నర్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఐదో స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానంలో నిలిచాయి. చెరో ఒక్కసారి ట్రోఫీ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. మూడు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్ (గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్).. ఆఖరి స్థానంలో నిలిచింది.

అగ్రస్థానంలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లు..
అగ్రస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో, దిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ మూడు జట్లు కూడా తమ మొదటి రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి చెరో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకున్నాయి.

వాస్తవానికి ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు.. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా రాణిస్తాయని క్రికెట్ అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 13 లీగ్ మ్యాచులు పూర్తయ్యేసరికి అంచనాలు తారుమరైపోయాయి. ఇప్పటివరకు సాగిన మ్యాచుల ప్రదర్శన బట్టి టాప్ -3లో.. ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ నిలిచాయి. ఈ జట్లు తమ తర్వాతి మరో మూడు, నాలుగు మ్యాచుల్లోనూ ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తే ప్లేఆఫ్స్ కు కచ్చితంగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Story first published: Wednesday, April 2, 2025, 7:38 [IST]
Other articles published on Apr 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+