Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Points Table: సన్‌రైజర్స్ టాప్ ప్లేస్.. పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?

IPL Points Table: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమై అప్పుడే నాలుగు రోజులు ముగిసింది. ఈ సీజన్ లో ఫస్ట్ రౌండ్ పూర్తి అయింది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 10 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. ఈ నాలుగు రోజుల్లోనే చాలా జట్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. ఒక్కొక్క జట్టు 14 మ్యాచ్ లు ఆడే ఈ ఈవెంట్ లో ఏ జట్టు ఫైనల్ కు చేరుతుందో.. ఏ జట్టు ఇంటిదారి పడుతుందో అస్సలు ఊహించలేం. 10 జట్లు పాల్గొంటున్న ఈ ఐపీఎల్ టోర్నమెంట్ లో అగ్రస్థానంలో ఉన్న నాలుగు జట్లు ప్లేఆఫ్ రౌండ్ కు చేరుకుంటాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్టుకు అదనపు ప్రయోజనం ఉంటుంది.

టాప్‌లో ఉన్న 5 జట్లు ఇవే..
ప్రస్తుతం ఐదు జట్లు ఒక్కొక్క విజయంతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మిగతా ఐదు జట్లు ఓడిపోయి చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు పాయింట్లు, 2.20 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు -2.200 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఒక్కో మ్యాచ్ లో ఓడిపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మొదటి మ్యాచ్ తోనే బోణీ కొట్టాయి.

IPL 2025 Points Table First Round Complete Sun Risers Hyderabad in Top Place
Take a Poll

అగ్రస్థానం హైదరాబాద్‌దే..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.13 రన్ రేట్, 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 2 పాయింట్లు, 0.55 రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 2 పాయింట్లు, 0.49 రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు, 0.37 రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది. సీఎస్కే మూడో స్థానంలో ఉండగా.. తాజాగా ఎక్కువ పరుగులు సాధించి విజయం సాధించడంతో పంజాబ్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. సీఎస్కే వేగంగా లక్ష్యాన్ని ఛేదించి ఉంటే.. వారు మొదటి రెండు స్థానాలను దక్కించుకునేవారు. లక్నో మైనస్ 0.37 రన్ రేట్ తో ఆరో స్థానంలో, ముంబై మైనస్ 0.49 రన్ రేట్ తో ఏడో స్థానంలో, గుజరాత్ మైనస్ 0.55 రన్ రేట్ తో ఎనిమిదో స్థానంలో, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా మైనస్ 2.13 రన్ రేట్ తో తొమ్మిదో స్థానంలో, రాజస్థాన్ మైనస్ 2.20 రన్ రేట్ తో పదో స్థానంలో ఉన్నాయి.

పాయింట్ల పట్టిక ఇదే..

Story first published: Wednesday, March 26, 2025, 11:21 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+