Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 Points Table: ఆర్సీబీపై ఓటమితో సీఎస్కే పతనం.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు!

IPL 2025 Points Table: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చెన్నైసూపర్ సింగ్స్(సీఎస్కే)ను ఓడించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. మరోవైపు ఓటమి కారణంగా సీఎస్కేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కే ఇప్పుడు నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి తొలి విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 8 మ్యాచ్‌ల తర్వాత ఆర్సీబీ పరిస్థితి చాలా మెరుగ్గా కనిపిస్తోంది.

ఐపీఎల్ 2025లో మూడు జట్లు ఇంకా ఖాతా తెరవలేదు..
ఐపీఎల్ 2025లో ఇంకా మూడు జట్లు ఖాతా తెరవలేదు. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వారి సొంత మైదానంలో ఓడించింది. రెండో జట్టు గుజరాత్ టైటాన్స్.. దీనికి శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేని మూడో జట్టు రాజస్థాన్ రాయల్స్. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది.

IPL 2025 Points Table CSK s Decline After Defeat to RCB Key Changes in Standings

నేడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా ఏదో ఒక జట్టు తన ఖాతాను తెరవనుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రదర్శన ఇప్పటివరకు అంత బాగా లేదు. ముంబైకి తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా మద్దతు లభించలేదు. అయితే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు.

ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు ఇలా..

1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2.లక్నో సూపర్ జెయింట్స్
3. పంజాబ్ కింగ్స్
4. ఢిల్లీ క్యాపిటల్స్
5. సన్‌రైజర్స్ హైదరాబాద్
6. కోల్‌కతా నైట్ రైడర్స్
7. చెన్నై సూపర్ కింగ్స్
8.ముంబై ఇండియన్స్
9.గుజరాత్ టైటాన్స్
10. రాజస్థాన్ రాయల్స్

*పాయింట్ల పట్టిక ఇదే..

Story first published: Saturday, March 29, 2025, 16:28 [IST]
Other articles published on Mar 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+