Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆ జట్లు ఇంటికే.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇలా?

IPL 2025: మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 14 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కోల్‌కతా జట్టు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ జట్టు గత 6 మ్యాచ్‌ల్లో వరుసగా నాలుగు ఓడిపోయింది. ఆ తర్వాత జట్టు సమస్యలు పెరిగాయి. ఢిల్లీ జట్టు మరోసారి సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కోసం రేసు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి 10 ఐపీఎల్ జట్ల మార్గం ఇలా..
1.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 14 పాయింట్లతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆ జట్టు ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో రెండు వారి సొంత మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనున్నారు. టాప్-4లో ఆర్సీబీ స్థానం సంపాందించాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి.

IPL 2025 Playoffs Scenario Which Teams Are Still in Contention

2. ముంబై ఇండియన్స్
10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు వరుసగా 5 మ్యా‌చ్‌ల్లో విజయం సాధించింది ఇప్పుడు ముంబై జట్టుకు ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే వారు 3 మ్యాచ్‌లు గెలవాలి.

3. గుజరాత్ టైటాన్స్
గుజరాత్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడగా.. అందులో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.గుజరాత్ ఇప్పటివరకు గొప్ప ఫామ్‌లో ఉంది. గుజరాత్ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవాలి. మిగిలిన మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టు గెలిస్తే టాప్-4కు చేరుకోవడం ఖాయం.

4. ఢిల్లీ క్యాపిటల్స్

ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. కానీ గత 6 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయిన తర్వాత ఢిల్లీ సమస్యలు కొంచెం పెరిగాయి. గొప్ప ఆరంభం తర్వాత, అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. టాప్-4 రేసులో స్థానం సంపాదించడానికి వారు లీగ్ దశలో మిగిలిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి.

5. పంజాబ్ కింగ్స్
ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. లీగ్ దశలో వారికి ఇంకా 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే కనీసం 3 మ్యాచ్‌ల్లో గెలవాలి.

6.లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రదర్శన ఇప్పటివరుకు అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆడి 5 మ్యాచ్‌లలో గెలిచింది. మరో ఐదింటిలో ఓడిపోయింది. లక్నో జట్టు టాప్-4కు చేరుకునే అవకాశాలు ఇంకా ముగియలేదు. లక్నో జట్టు మిగిలిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అయినట్టే.

7. కోల్‌కతా నైట్ రైడర్స్
ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించి కేకేఆర్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది కేకేఆర్‌కు లీగ్ దశలో ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే వారు మూడు మ్యాచ్‌లు గెలవాలి. కేకేఆర్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

8. రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్లేఆఫ్స్ అర్హత కోసం రాజస్థాన్ జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

9. సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2025లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఇప్పటివరకు నిరాశపరిచింది. హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించగా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. హైదరాబాద్ జట్టుకు లీగ్ దశలో ఇంకా 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ ఓడినా ఎస్ఆర్‌హెచ్ ఆట ముగిసినట్లే.

10. చెన్నై సూపర్ కింగ్స్
ఇప్పటివరకు సీఎస్కే జట్టు 9 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ధోని నేతృత్వంలోని సీఎస్కే లీగ్ దశలో ఇంకా 5 మ్యాచ్ లు ఆడాలి. వారు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. అయితే, అతని జట్టు టాప్-4కి చేరుకోవడానికి ఒక అద్భుతం జరగాల్సిందే.

Story first published: Wednesday, April 30, 2025, 15:28 [IST]
Other articles published on Apr 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+