IPL 2025: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి తర్వాత ప్లేఆఫ్స్ పోరు చాలా కఠినంగా మారింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఒక్క ప్లేఆఫ్ స్థానం మిగిలి ఉంది. ఒకే ఒక్క ప్లేఆఫ్ స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. మూడు జట్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఒక ప్లేఆఫ్ స్థానం కోసం పోటీపడనున్నాయి. ఇప్పుడు ఈ మూడు జట్లకు ఒకే ఒక మార్గం ఉంది. వారు మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకుంటారు. ముంబై, ఢిల్లీ, లక్నో జట్లు ప్లేఆఫ్ చేరుకోవాలంటే..
ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇలా..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు జట్లలో ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ముంబై జట్టు బలమైన పోటీదారుగా ఉంది. దీని కోసం ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో లక్నో ఓడినా ముంబై జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ముంబై ఢిల్లీ చేతిలో ఓడిపోయి పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించినట్లయితే.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ వారిని అధిగమిస్తుంది. ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను కూడా ఓడించాల్సి ఉంటుంది. అయితే ముంబై జట్టు రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది.

ముంబై ఇండియన్స్ జట్టు కూడా టాప్-2లో నిలిచే గొప్ప అవకాశం ఉంది. ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. వారి అద్బుతమైన నెట్ రన్ రేట్ కారణంగా టాప్-2కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్సీబీ, పంజాబ్ జట్లు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి 17 పాయింట్ల వద్ద కొనసాగితేనే ఇది సాధ్యమవుతుంది. అయితే గుజరాత్ టైటాన్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా ముంబై పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని సాధించగలదు.
ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఇలా..
ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ జట్లు తమ చివరి 8 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోవడం ద్వారా దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే.. ఐపీఎల్ 2025లో ఢిల్లీ ప్రయాణం ముగిసిపోతుంది. ఢిల్లీ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరగలుగుతుంది. అలాగే లక్నో జట్టు తన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలని ఢిల్లీ ప్రార్థించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో లక్నో, ముంబై జట్లు రెండూ 16 పాయింట్లతో వెనుకబడి ఉంటాయి. ఢిల్లీ ముంబైపై గెలిచిన, పంజాబ్ జట్టుపై ఓడినా.. 15 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. అలా జరిగితే ముంబై అధిగమించే అవకాశం కూడా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఇలా..
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయింది. లక్నో జట్టుకు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.వారు ప్లేఆఫ్ కు చేరుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. లక్నో తన మిగిలిన మ్యాచ్‌లను గెలవడం ద్వారా 16 పాయింట్లను చేరుకోగలదు. అలాగే ముంబై, ఢిల్లీ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలని లక్నో కోరుకుంటుంది.