Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎన్ని పాయింట్లు అవసరం?.. ఈ 3 జట్లు ఇంటికే!

IPL 2025: ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. దీంతో ప్లేఆఫ్స్ లెక్కలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్టు కనీసం 3 మ్యాచ్‌లు ఆడగా.. గరిష్టంగా 5 మ్యాచ్‌లు ఆడాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఈ సీజన్‌లో వింతగా కదులుతోంది. ఐదు సార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పాటు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు చివరి మూడు స్థానాల్లో ఉన్నాడు. మూడు జట్లు ఐదు మ్యాచ్‌ల తర్వాత చెరో 4 ఓటములను చవిచూశాయి. చెరో 2 పాయింట్లను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ మూడు జట్లకు సంబంధించి నికర రన్ రేట్ మైనస్ లో ఉంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న 4 జట్లు ఇవే..
ఈ ఐపీఎల్ సీజన్‌లో 23 మ్యాచ్ ల తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 5 మ్యాచ్‍ల్లో 4 విజయాలతో 8 పాయింట్లను కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లను కలిగి ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో ఉంది. నికర రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

IPL 2025 Playoffs Qualification Scenario Points Needed and Teams in Trouble

ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని పాయింట్లు అవసరం?
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి, ఎన్ని పాయింట్లు అవసరం?. నిజానికి ప్రతి సీజన్ లో ఈ లెక్కలు మారిపోతుంటాయి. అయితే 8 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 14 పాయింట్లు ఉన్న జట్లు కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం కూడా చాలా సార్లు కనిపించింది. ఒక్కోసారి 12 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

2021లో 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన కేకేఆఱ్
2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లను కలిగి ఉంది. కానీ నికర రన్ రేట్ ఆధారంగా కేకేఆర్ మెరుగ్గా ఉంది. ఐపీఎల్‌లో ప్రతి విజయం తర్వాత 2 పాయింట్లు ఇవ్వబడతాయి. అయితే నికర రన్ రేట్ గెలుపు, ఓటమి మధ్య వ్యత్యాసం ఆధారంగా లెక్కించబడుతుంది. టై అయిన మ్యాచ్ లో జట్లకు తలో ఒక పాయింట్ ఇవ్వబడుతుంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉండడం వల్ల ప్రయోజనమేంటి?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ర్యాంకింగ్స్ లో టాప్-2 జట్లకు ఫైనల్ కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. నిజానికి క్వాలిఫయర్-1 టాప్-2 జట్ల మధ్య జరగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం పొందుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరిన రెండో జట్టు అవుతుంది.

Story first published: Thursday, April 10, 2025, 14:50 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+