IPL 2025: ఐపీఎల్ 2025లో లీగ్ రౌండ్‌లో 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్స్‌కు 4 జట్లు నిర్ణయించబడ్డాయి. 58 మ్యాచ్‌ల వరకు ఎవరు ప్లేఆఫ్‌కు చేరుకుంటారని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ దీని తర్వాత మే 18న జరిగిన డబుల్ హెడర్ అన్ని సమీకరణాలను పరిష్కరించిది. ఇప్పుడు క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు నిర్ణయించబడ్డాయి. మే 29న జరిగే మొదటి క్వాలిఫయర్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు అంటే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి.
అదే సమయంలో మే 30న జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ నాలుగు జట్లు ఇంతకు ముందు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి కానీ ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఎప్పుడూ టైటిల్ గెలవలేదు. ఈ రెండు జట్లు తమ మొదటి టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ 2022లో టైటిల్‌ను గెలుచుకుంది. ముంబై ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. ఈ జట్లు ఇతంకు ముందు ఎప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయో, లీగ్ రౌండ్‌లో ఏ స్థానంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయో తెలుసుకుందాం.

1.పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది ఇది మూడో సారి మాత్రమే. అంతకు ముందు ఆ జట్టు 2008, 2014లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2008లో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 2014లో ఆ జట్టు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే 2008లో పంజాబ్ సెమీ-ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో 2014లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు 2025లో పంజాబ్ జట్టు మరోసారి అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సారి పంజాబ్ కింగ్స్ తన టైటిల్ కరువును అంతం చేసుకోగలదా లేదా అనేది చూడాలి. శ్రేయస్ అయ్యర్ గతంలో కేకేఆర్ జట్టు తరఫున ఆడి టైటిల్ గెలుచుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో ఏడాది టైటిల్ గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
2.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పదోసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గతంలో ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024లలో కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఆ జట్టు 2009, 2011, 2016లలో రన్నరప్‌గా నిలిచింది. 2011లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 2016లో రెండో స్థానంలో నిలిచింది. 2009, 2015, 2021లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 2010, 2020, 2022, 2024లలో ఆ జట్టు నాల్గవ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు మరోసారి ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. కాబట్టి ఆర్సీబీ తమ మునపటి రికార్డును బ్రేక్ చేయాలనుకుంటోంది. ఫైనల్ కు చేరుకోవడంతో పాటు ఎలాగైనా ఈ సారి టైటిల్ ను గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
3.గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి నాలుగు సీజన్లలో ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తర్వాత స్థిరమైన జట్టుగా నిలిచింది. 2022లో తన తొలి సీజన్‌లోనే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. దీని తర్వాత 2023లో కూడా ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ సీఎస్కే చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ రెండు సీజన్లలో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత 2024లో గుజరాత్ జట్టు లీగ్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఆ జట్టు అప్పుడు 8వ స్థానంలో ఉంది. ఈ సారి గుజరాత్ జట్టు మూడో స్థానంలో నిలిచి అర్హత సాధించింది.
4. ముంబై ఇండియన్స్
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఐదు సీజన్లలో ఆ జట్టు మొదటి రెండు స్థానాల్లో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు మూడవ లేదా నాల్గవ స్థానంలో నిలిచి టైటిల్ గెలవలేదు. ఈ సారి ఆ ప్రకటన తప్పు అని నిరూపించడానికి జట్టు ప్రయత్నిస్తోంది. ముంబై జట్టు మొత్తం 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే ఈ సీజన్లన్నింటిలోనూ ఆ జట్టు మూడు లేదా నాల్గవ స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై జట్టు ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.