Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరే జట్లు ఇవే - దిగ్గజ క్రికెటర్ల ప్రిడక్షన్!!

IPL 2025 Playoffs Prediction: 10 జట్లు.. 74 మ్యాచులు.. ఐపీఎల్ 2025 - రసవత్తర సమరం వచ్చేసింది. దీంతో ఈ మెగా లీగ్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే జట్లేవి?, ఫైనల్‌కు అర్హత సాధించే జట్లేవి?, టైటిల్ ఛాంపియన్‌గా ఎవరు నిలుస్తారు? అని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు తమ అంచనాలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ చేరడం అంటే అంత సులువేమీ కాదు. ఈ విషయం ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు బాగా తెలుసు. టాలెంటెడ్ స్టార్ క్రికెటర్లతో ఆడినప్పటికీ ఈ జట్లు చాలా సార్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. సరే ఏదేమైనా..తాజా సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరేదెవరు? అంటే చెప్పడం కాస్త కష్టమేనైనా.. పలువురు మాజీలు తమ ప్రిడక్షన్స్ ను తెలిపారు.

ఆ రెండు జట్లను ఎవరూ పట్టించుకోలే..
వీరిలో ఇద్దరు మాజీ క్రికెటర్లు తప్ప, ఇంకెవరు కూడా ఆర్సీబీకి మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. కేవలం ఆల్ రౌండర్ రోహన్ గవాస్కర్, కామెంటేటర్ హర్ష బోగ్లే మాత్రమే ఆర్సీబీ టాప్ -4లో ముగుస్తుందని అంచనా వేశారు. సెహ్వాగ్ అయితే తన టాప్ -4 ప్రిడక్షన్‌లో ఆర్సీబీతో పాటు సీఎస్కే పేరును కూడా ప్రస్తావించలేదు. మొత్తంగా 10లో 8 మంది సన్‌రైజర్స్ జట్టే ఫైనల్‌కు చేరుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మాజీ క్రికెటర్ల ప్లేఆఫ్స్ ప్రిడక్షన్స్ ఇవే

వీరేంద్ర సెహ్వాగ్ : ముంబయి, సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ
అడమ్ గిల్ క్రిస్ట్: పంజాబ్ కింగ్స్, ముంబయి, సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్
రోహన్ గవాస్కర్: ఆర్సీబీ, సన్‌రైజర్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి
హర్ష బోగ్లే: సన్‌రైజర్స్, ముంబయి, కేకేఆర్, ఆర్సీబీ
షాన్ పొల్లాక్: ముంబయి, సీఎస్కే,సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్
మనోజ్ తివారీ: సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్
సిమాన్ డౌల్: సీఎస్కే, కేకేఆర్, సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్,
మైఖేల్ వాన్: గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్
Mpumelelo Mbangwa: సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్,సన్‌రైజర్స్

IPL 2025 Playoffs Prediction by Virender Sehwag Snubs RCB CSK
Photo Credit: twitter screenshot
Story first published: Friday, March 21, 2025, 9:16 [IST]
Other articles published on Mar 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+