Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ప్లేఆఫ్స్ స్థానం కోసం ఢిల్లీ, ముంబై మధ్య హోరాహోరీ!

IPL 2025: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. అయితే తాజాగా ఎస్ఆర్‌హెచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా చెడగొట్టింది. సోమవారం రాత్రి లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో లక్నోను ఓడించడంతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకే ఒక ప్లేఆఫ్ స్థానం ఖాళీగా ఉంది.

అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఒకటి మాత్రమే టాప్-4లోకి చేరుకోగలదు. ఢిల్లీ క్యాపిటల్స్ లేదా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌‌ చేరుకోవడానికి రెండు జట్ల సమీకరణాన్ని తెలుసుకుందాం.

IPL 2025 Playoff Battle Intensifies Between Delhi Capitals and Mumbai Indians

ఢిల్లీ, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి సమీకరణాలు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు రెండింటికీ ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టు ముంబైతో ఒక మ్యాచ్, పంజాబ్‌తో ఒక మ్యాచ్ ఆడనుంది. ముంబై జట్టు ఢిల్లీతో ఒక మ్యాచ్, పంజాబ్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ జట్లు ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే సమీకరణాలు ఇలా ఉన్నాయి.

1. ముంబై ఢిల్లీని ఓడిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
2.ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై, పంజాబ్ జట్లను ఓడిస్తే అర్హత సాధించగలుగుతుంది.
3. ఢిల్లీ ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి పంజాబ్ చేతిలో ఓడితే.. ముంబై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఇండియన్స్ అర్హత సాధిస్తుంది.
4. ముంబై ఢిల్లీ, పంజాబ్ రెండింటి చేతిలోనూ ఓడిపోతే.. ఢిల్లీ కూడా పంజాబ్ చేతిలో ఓడిపోతే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.

Story first published: Tuesday, May 20, 2025, 13:27 [IST]
Other articles published on May 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+