Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS VS LSG: అప్పుడు కోహ్లీ చేస్తే ప్రశంసలు! - ఇప్పుడు దిగ్వేశ్‌ చేస్తే విమర్శలు!!

Digvesh singh: ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములు, కెప్టెన్ వైఫల్యంతో.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఆ జట్టు స్పిన్నర్ దిగ్వేశ్‌ తీరు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అది ఒక్కప్పటి కోహ్లీని గుర్తు చేసింది. ఇదే సమయంలో దిగ్వేశ్ తీరు విమర్శలకు గురి చేస్తోంది.

ఇంతకీ దిగ్వేశ్ ఏం చేశాడంటే?
మూడో ఓవర్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేసిన దిగ్వేశ్.. ఆ తర్వాత సంబరాలు చేసుకున్నాడు. కెస్రిక్ విలియమ్స్‌ తరహాలో నోట్ బుక్, సంతకం సంబరాలు చేసుకున్నాడు. అంటే ప్రియాంశ్‌ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి మరీ నీ వికెట్‌ను నా ఖాతాలో వేసుకున్నాను అనే అర్థం వచ్చేలా చేతిపై సంతకం చేసి అతడికి చూపించాడు.

ipl 2025 PBKS VS LSG Digvesh Rathi notebook Celebrations recalls virat Kohli

కోహ్లీ కూడా అలానే..
అయితే ఇదే తరహాలో గతంలో కోహ్లీ కూడా చేశాడు. అయితే అందుకు మరో కారణం ఉంది. 2017 సిరీస్ లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన సందర్భంలో కెస్రిక్‌ విలియమ్స్ నోట్ బుక్, సంతకం సంబరాలు చేసుకున్నాడు. కానీ కోహ్లీ ఎవరైనా కవ్విస్తే అస్సలు ఊరుకోడు కదా. ఆ తర్వాత మ్యాచులో.. విలియమ్స్‌ బౌలింగ్‌లోనే వరుసగా బౌండరీలు బాదాడు కోహ్లీ. అప్పుడు తాను కూడా 'సంతకం' హావభావాలు పలికించాడు. ఇప్పుడా సందర్భాన్నే గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.

ఇదే విషయాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ అలా చేయడంలో అర్థం ఉందని, కానీ దిగ్వేశ్‌ అలా చేయడంలో ఎటువంటి అర్థం లేదనిపిస్తోందని పేర్కొన్నాడు. ఎందుకంటే వరుసగా 5 బంతులు డాట్స్‌గా వేసి, ఆ తర్వాత చివరి బంతికి వికెట్ పడినప్పుడు ఇలాంటి సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదు అని వెల్లడించాడు. ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కూడా దిగ్వేశ్ చర్యకు గానూ అతడి మ్యాచులో ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ విధించింది.

Story first published: Wednesday, April 2, 2025, 10:47 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+