IPL 2025: ఒకడు బోల్డ్.. ఇంకొకడు గోల్డ్ - అదరగొట్టిన షారుక్, కోహ్లీ డ్యాన్స్ (వీడియో)
IPL 2025 Sharukh Khan Kohli: ఐపీఎల్ 2025 అట్టహాసంగా మొదలైపోయింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆరంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ.. కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ(KKR VS RCB) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
IPL 2025 Opening Ceremony: మొదట స్టేజ్ పైకి వెళ్లి సందడి చేసిన షారుక్ ఖాన్.. ఆ తర్వాత కోహ్లీని వేదికపైకి ఆహ్వానించాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు కూడా కరతాళ ధ్వానులు, కేరింతలతో కోహ్లీ.. కోహ్లీ అంటూ స్వాగతం పలికారు. అనంతరం షారుక్.. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే టీమ్ (ఆర్సీబీ)కి కోహ్లీ ఆడటాన్ని అభినందించాడు. ఆ తర్వాత తన జట్టు ఆటగాడైన రింకూ సింగ్ ను కూడా స్టేజ్ పైకి ఆహ్వానించాడు షారుక్. అనంతరం ఇద్దరూ కలిసి లుట్ ఫుట్ గయా సాంగ్ కు డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత పటాన్ సినిమాలోని మేరీజాన్ పాటకు విరాట్, షారుక్ కూడా కలిసి చిందులేశారు.

అతడు బోల్డ్.. ఇతడు గోల్డ్..
షారుక్ మాట్లాడుతూ.. "రింకూ సింగ్ ఈ జనరేషన్ బోల్డ్, విరాట్ కోహ్లీ జనరేషన్ గోల్డ్" అంటూ అభివర్ణించాడు. కోహ్లీ మాట్లాడుతూ.. "బోల్డ్ జనరేషన్ చాలా బలంగా కనిపిస్తోంది. పాత తరం ఇంకా ఇక్కడ జ్ఞాపకాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోంద"ని అన్నాడు.
ఇక ఇదే స్టేజ్ పై విరాట్ కోహ్లీకి ఐపీఎల్ 18 మెమెంటోనూ బీసీసీఐ అధ్యక్షుడుడ రోజర్ బిన్నీ ప్రదానం చేశారు. ఇంకా ఈ వేడుకలో బీసీసీఐ కార్యదర్శి దేవ్ జిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సహా పలువురు హాజరై సందడి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications