IPL 2025 Opening Ceremony: హాట్ హాట్ హీరోయిన్ల లిస్ట్ ఇదే.. ఫ్యాన్స్‌కు ఫుల్ బాటిల్ కిక్కే!
IPL 2025 Opening Ceremony: ఐపీఎల్ 2025కు వేళైంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఈ మెగా లీగ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బీసీసీఐ కూడా ఎప్పటిలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది.
ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్స్ ను ఆహ్వానించినట్లు తెలిసింది. వారిలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లు రాబోతున్నారని రెండు మూడు రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అయితే వీరితో పాటే మరికొంతమంది అందమైన భామలు కూడా రాబోతున్నారట. తమ అందాలతో, చిందులతో ప్రేక్షకుల్ని ఫిదా చేయనున్నారట.

ఆ అందమైన భామలు ఎవరంటే?
విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, యంగ్ సెన్సేషన్ హాట్ బ్యూటీ తృప్తి డిమ్రి, యంగ్ హీరోయిన్ అనన్య పాండే, సీనియర్ అందాల భామ మాధురి దీక్షిత్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఐటెమ్ సాంగ్ డ్యాన్సర్ ఊర్వశి రౌతేలా, పొడుగు కాళ్లల సుందరి పూజా హెగ్డే, సీనియర్ భామ కరీనా కపూర్, యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్, దిశా పటానీ సహా పలువురు రాబోతున్నారని సమాచారం అందింది. ఇంకా శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, వరుణ్ ధావన్ కూడా వస్తారట. ఈ విషయాన్ని ఐపీఎల్ ఆర్గనైజర్ల సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తొలి మ్యాచ్, ఫైనల్.. రెండూ అక్కడే..
ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తంగా 74 మ్యాచ్ లు 13 వేదికల్లో నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ కోల్‌కతాలో ని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే ఈడెన్ గార్డెన్సే ఫైనల్ కు కూడా ఆతిథ్యమివ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications