ఐపీఎల్-2024లో టైటిల్ సాధించనప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్ సూపర్ హిట్టే అయ్యింది. టీ20 ఫార్మాట్‌లో సరికొత్త బ్యాటింగ్ ట్రెండ్‌ను పరిచయం చేసింది. క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం నెలకొల్పింది. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడింది. అత్యధిక స్కోరు రికార్డును రెండు సార్లు బ్రేక్ చేసింది.
అలాగే ఓ సీజన్‌లో జట్టు పరంగా అత్యధిక సిక్సర్లు, పవర్‌ప్లే, 10 ఓవర్లలో అత్యధిక స్కోరు రికార్డులు నమోదు చేసింది. అయితే టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్ తుదిమెట్టుపై మాత్రం బోల్తా పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. కనీస పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది. వచ్చే సీజన్‌లో పొరపాట్లను సరిదిద్దుకుని కప్‌ను సాధించాలని భావిస్తోంది.

అయితే ఐపీఎల్-2025కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను అట్టిపెట్టుకోగలదు. గత నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లను ఉంచుకొని మిగిలిన అందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు లేదా ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు, ఓ విదేశీ క్రికెటర్‌ను తమ జట్టుతో ఉంచుకోవచ్చు. రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్ద్ ద్వారా మరో ఆటగాడిని దక్కించుకోవచ్చు.
2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ కేవలం ముగ్గరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకుంది. కానీ 2023 వేలానికి ముందు కేన్ మామను విడుదల చేసింది. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సన్‌రైజర్స్ టీమ్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. విదేశీ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్క్‌రమ్, ప్యాట్ కమిన్స్‌లతో, భారత ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, నటరాజన్, భువనేశ్వర్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, రాహుల్ త్రిపాఠిలతో జట్టు కూర్పు సమతూకంగా ఉంది.
కానీ, మెగా వేలానికి ముందు నలుగురు ప్లేయర్లు మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఏఏ ఆటగాళ్లు ఫ్రాంచైజీతో ఉంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే జట్టును దూకుడుగా నడిపించిన కెప్టెన్ కమిన్స్‌ను వదులుకోవాలని ఫ్రాంచైజీ ఆలోచిస్తోంది. కమిన్స్‌ను గత వేలంలో రూ.20.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. అయితే కమిన్స్‌ను రిటైన్ చేసుకుంటే సన్‌రైజర్స్ గత నిబంధనల ప్రకారం అదే భారీ మొత్తాన్ని వెచ్చించదు. ఈ నేపథ్యంలో కమిన్స్ ఆ మొత్తాన్ని అంగకీరిస్తాడో లేదో చూడాలి.
అయితే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా కమిన్స్‌ను సొంతం చేసుకోవాలనే బ్యాకప్ ప్లాన్‌తో సన్‌రైజర్స్ ఉంది. ఇక ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ను రిటైన్ చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. భారత యువ ఆటగాళ్లలో అభిషేక్ శర్మ, నటరాజన్‌ను అట్టిపెట్టుకోవాలని యోచిస్తోంది. అలాగే నితీశ్ రెడ్డిని కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఓ ఫ్రాంచైజీ కన్నేసింది. నిబంధనలు మార్చి రెండు ఆరీటీఎమ్‌లకు అవకాశం ఇస్తూ నితీశ్‌ను దక్కించుకోవాలని చూస్తోంది.
సన్‌రైజర్స్ రిటైన్ లిస్ట్ (అంచనా)
హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నటరాజన్