Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL లవర్స్‌కు గట్టి దెబ్బేసిన జియోహాట్‌స్టార్‌.. ఇకపై పైసలు కట్టాల్సిందే!

రిలయన్స్ కు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ కలిసి జియోహాట్‌స్టార్‌ గా అవతరించింది. ఈ రెండు కలిసి సంయుక్త సేవలను ప్రారంభించాయి. అయితే దీనివల్ల ఐపీఎల్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను చూసే అవకాశాన్ని ఈ జియోహాట్ స్టార్ కల్పించలేదు. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సిందేని తెలిపింది. ఇంతకీ మ్యాచ్ లను చూడాలంటే ఆ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఎంతో తెలుసుకుందాం..

సబ్‌స్క్రిప్షన్‌ ఎంతంటే?
ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంచక్కా ఓటీటీలో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఎక్కడ ఉన్న కూడా తమ స్మార్ట్ ఫోన్ లో యాప్ ఓపెని క్రికెట్ చూస్తూ ఆస్వాదించేవారు. కానీ ఇకపై ఆ సదుపాయాం ఉండదు. అందుకు కారణం ఇకపై జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనం అవ్వడమే. ఇలా విలీనం అవ్వడం వల్ల రెండింటిలోని కంటెంట్‌ ఒకే దాంట్లోనే వీక్షించొచ్చు. అంటే కంటెంట్ ను జియోహాట్‌స్టార్‌ లో వీక్షించొచ్చు అన్నమాట. అయితే ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లోని కంటెంట్ ను చూడాలంటే కచ్చితంగా రూ.149 నుంచి ఉండే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ను రిచార్జ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఐపీఎల్ మ్యాచులు చూడాలంటే కనీస ప్లాన్‌ రూ. 149తో సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

IPL 2025 No free streaming in JioHotstar subscription plans after JioCinema Dinsey Hoststar merger

వచ్చే 3 నెలల పాటు
ఒకవేళ యూజర్ ఇప్పటికే హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకుని ఉంటే.. వచ్చే మూడు నెలల పాటు పాత రేట్లే ఉంటాయి. అలాగే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా... వారికి జియోహాట్‌స్టా‌ర్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ వచ్చేస్తుంది.

Story first published: Friday, February 14, 2025, 14:21 [IST]
Other articles published on Feb 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+