IPL 2025: గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 18వ ఓవర్ మొదటి బంతికే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో తుస్సుమనిపించాడు. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ కాస్త బాధతో కనిపించాడు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఇషాన్ కిషన్‌కు మద్దతుగా నిలిచారు. తన చెంపపై చేయి పెట్టి ఇషాన్ కిషన్ ను ఓదార్చినట్లు కనిపించింది.
ఇషాన్‌ను కలిసిన నీతా అంబానీ
మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ, ఇషాన్ కిషన్ వాంఖడే స్టేడియంలో కలుసుకున్నారు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఇషాన్ కిషన ముంబై జట్టులో 7 సీజన్లు ఉన్నాడు. తర్వాత హైదరాబాద్ ఇషాన్ కిషన్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వాంఖడే స్టేడియంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా ఆడటం ఇదే మొదటిసారి. బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ అంతగా రాణించలేకపోయాడు. ఇషాన్ కిషన్ కేవలం 2 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత ఈ భావోద్వేగ కోణం వెలుగులోకి వచ్చింది.

నీతా అంబానీని పలకరించిన ఇషాన్ కిషన్
మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటూ తమ తమ జట్ల వైపు వెళ్తున్నారు. తర్వాత ఇషాన్ కిషన్ నీతా అంబానీ దగ్గరకు వెళ్లి ఆమెను చిరునవ్వుతో పలకరించాడు. నీతా అంబానీ కూడా ఇషాన్ పలకరింపుకు ప్రేమగా స్పందించి అతన చెంప మీద తట్టింది. ఇషాన్ ముంబై యజమాని నీతా అంబానీతో మాట్లాడి అనంతరం హైదరాబాద్ జట్టు వద్దకు తిరిగి వెళ్లాడు.
ముంబై అద్భుతమైన ప్రదర్శన
ఈ మ్యాచ్ లో ముంబై చాలా బాగా ఆడి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు, తిలక్ వర్మ 21 నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లు సన్‌రైజర్స్‌ను 162 పరుగులకే పరిమితం చేశారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్ బాగా బౌలింగ్ చేశారు. చివరికి హైదరాబాద్ జట్టు పోరాడింది. హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులు చేయగా, చివరి ఓవర్లో అనికేత్ వర్మ కొన్ని మంచి షాట్లు కొట్టాడు. కానీ ముంబై పరిస్థితులను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా ఆడింది. ఈ విజయంతో ముంబై 6 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఐపీఎల్ 2025 సీజన్ సన్‌రైజర్స్ కు కష్టంగా మారింది. హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పుడు వారు ప్లేఆఫ్స్ చేరుకోవడానికి చాలా కష్టపడాలి.