IPL 2025: ముంబయి జట్టులోకి కొత్త స్పిన్నర్.. అతడి స్థానంలోకి..
రీసెంట్ గా ముంబయి ఇండియన్స్ జట్టులో 18 ఏళ్ల స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా అతడి స్థానాన్ని కొత్త ఆటగాడితో భర్తీ చేసింది ముంబయి. ఘజన్‌ఫర్ స్థానాన్ని అప్ఘానిస్థాన్ కు చెందిన స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ తో రీప్లేస్ చేసింది. ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించంది. ఘజన్‌ఫర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ముంబయి ఇండియన్స్.. ముజీబ్ ను తమ జట్టులోకి ఆహ్వానించింది.
ముజీబ్ కెరీర్ ఇదే
ముజీబ్ ఉర్ రెహ్మాన్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. అతడు తన 17ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ముజీబ్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం అతడు 19 మ్యాచులు ఆడి 19 వికెట్లు తీశాడు. 2018 సీజన్ లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతడిని మొదటగా పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పుడు అతడు 11 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అప్పుడు కేకేఆర్ లో అతడి స్థానాన్ని ఘజన్‌ఫరే రీప్లేస్ చేయడం గమనార్హం. అప్ఘానిస్థాన్ క్రికెట్ లో బంతితో ప్రభావం చూపిన యంగెస్ట్ క్రికెటర్స్ లో ముజీబ్ ఒకడు. మొత్తంగా టీ20 కెరీర్ లో 300 మ్యాచులు ఆడి 6.5 ఎకానమీతో 330 వికెట్లు తీశాడు.

ఘజన్ ఫర్ ట్రాక్ రికార్డ్ ఇదే..
ఘజన్ ఫర్ గాయం బారిన పడటం వల్ల ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఇప్పటివరకు కెరీర్ లో 19 టీ20లు ఆడి 13.50 యావరేజ్ తో 40 వికెట్లు పడగొట్టాడు. ఒక ఓవర్ కు అతడి ఎకానమీ రేటు 6.2. కానీ అతడు ఇంకా టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే అంతర్జాతీయ వన్డేల్లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతడు 21 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications