Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS SRH: ముంబయి వీరుడికి గాయం - రక్తంతో మైదానం వీడిన ఆటగాడు!

IPL 2025 Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరుగుతోన్న కీలక మ్యాచులో ముంబయి ఇండియన్స్ కు గట్టి షాక్ తగిలింది. వాంఖెడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచులో ఎంఐ కీలక ప్లేయర్ కు గట్టిగానే దెబ్బ తాకింది.

ఇంతకీ అతడెవరంటే?
Karn Sharma Injured: చాహర్ బౌలింగ్ లో 2.5 ఓవర్ వద్ద అభిషేక్ శర్మ కొట్టిన బంతిని క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించిన కర్ణ్ శర్మ గాయపడ్డాడు. అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో అతడు మ్యాచు మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే బంతి తగలగానే కర్ణ్ శర్మ నొప్పితో విలివిలలాడాడు. అతడి చేతికి రక్తం కూడా కారింది. వెంటనే ఫిజియోలు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతడి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.

IPL 2025 Mumbai Indians key player Karn Sharma Injured in MI VS SRH match
Photo Credit: twitter screenshot

గత మ్యాచులో అద్భుతం..
ముంబయి ఇండియన్స్.. అంతకుముందు మ్యాచులో 12 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది కర్ణ్ వర్మనే. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్‌ శర్మ (3/36) అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను ముంబయి వైపునకు తిప్పాడు. అందుకే ఓడిపోవాల్సిన మ్యాచులో ముంబయి విజయం సాధించగలిగింది.

అంతా తుస్సే...
కాగా, ఈ సీజ‌న్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్).. రెండు జ‌ట్లు కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముంబ‌యి జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైద‌రాబాద్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మైన ఇరు జ‌ట్లు.. తాము ఆడిన త‌మ ఆఖ‌రి (ఆరో) మ్యాచ్‌ల‌ను విజ‌యాల‌తోనే ముగించాయి.

Story first published: Thursday, April 17, 2025, 20:25 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+