IPL 2025: ముంబయి ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. రూ.4.8 కోట్ల ప్లేయర్ జంప్!
ఐపీఎల్ 2025కి ముందు ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. మెగా వేలంలో ఏకంగా రూ.4.8 కోట్లతో కొనుగోలు చేసిన ప్లేయర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ముంబయి ఇండియన్స్ యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అతడెవరంటే?
ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేక క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్‌లో ఎలాగైనా అదరగొట్టాలని ఫిక్స్ అయింది. ఇందుకు గానూ బలమైన టాలెంటెండ్ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోవడంతో పాటు కొనుగోలు చేసింది. వారిలో 18 ఏళ్ల అల్లా ఘజన్‌ఫర్ కూడా ఒకడు. ఇతడిపై ముంబయి ఫ్రాంఛైజీ చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ అతడు సీజన్ ప్రారంభం కాకుండానే గాయంతో ఐపీఎల్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి కోసం ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో మూడు జట్లు పోటీపడ్డాయి. కేకేఆర్, ఆర్సీబీ, ముంబయి పోటీ పడగా.. చివరికి ముంబయి అతడికి ఎగరేసుకుపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం
ఘజన్‌ఫర్ ఐపీఎల్‌తో పాటు అంతకన్నా (ఈ నెల 19) నుంచి ముందే ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేకు అవకాశం ఇచ్చింది అఫ్ఘానిస్థాన్ క్రికెట్ క్లబ్. మొత్తంగా ఘజన్‌ఫర్‌కు గాయమవ్వడం ముంబయి ఇండియన్స్ తో పాటు ఆఫ్ఘాన్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
ఘజన్ ఫర్ ఇప్పటివరకు కెరీర్ లో 19 టీ20లు ఆడి 13.50 యావరేజ్ తో 40 వికెట్లు తీశాడు. ఒక ఓవర్ కు అతడి ఎకానమీ రేటు 6.2. కానీ ఇతడు ఇంకా టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే అంతర్జాతీయ వన్డేల్లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications