Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dhoni: ధోనీ వీల్ చెయిర్ సెల్ఫీ..!(వీడియో వైరల్)

Dhoni: ధోనీ తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచడు. తన ఆటతోనో, లేదంటే తన చర్యలతోనో ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. మైదానంలో తన వ్యూహాలతో ఆకట్టుకునే మహీ... ఆఫ్ ఫీల్డ్‌లో ఎంతో సింప్లిసిటీతో, కామ్ నేచర్‌తో, డౌన్ టు ఎర్త్‌గా (వినయంగా) ఉంటూ ఎన్నో కోట్ల మంది అభిమానులను హృదయాలను గెలుచుకున్నాడు. అయితే తాజాగా మహీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తలా ఫర్ ఏ రీజన్ అని మరోసారి అభిమానుల చేత అనిపించుకున్నాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహీ తాజాగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. భారీ సెక్యురిటీ మధ్య మహీ నడుస్తూ ఉండగా.. వీల్ చెయిర్ లో ఉన్న ఓ మహిళా .. సెల్ఫీ కోసం అతడిని అడిగింది. వెంటనే మహీ.. సెక్యురిటీ సిబ్బంది మధ్యలో నుంచి తనంత తానే ఆమె దగ్గరికీ వెళ్లి మరీ.. సెల్ఫీ దిగాడు. ఆమెను సంతోషపరిచాడు. తిరిగి యథావిధిగా వెళ్లిపోయాడు. దీంతో వీల్ చెయిర్ లో ఉన్న ఆమె ఎంతగానో సంతోషపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తలా ఫర్ ఏ రీజన్..
ఇది చూసిన తలా అభిమానులు, ధోనీని తెగ ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోను మరింతగా షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తలా ఫర్ ఏ రీజన్, మహీ లాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సీఎస్కే బ్యాక్ టు ట్రాక్..
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ లో సీఎస్కే ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయట్లేదు. రెగ్యులర్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కు గాయమవ్వడంతో ఈ సీజన్ కు దూరమ్యయాడు. దీంతో మహీ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు ఓటములు అందుకుంది సీఎస్కే. తొలి మ్యాచులో గెలవగా మళ్లీ... ఏడో మ్యాచులో విజయం సాధించింది.

IPL 2025 MS Dhoni took a Selfie himself with woman in wheelchair video goes viral
Story first published: Thursday, April 17, 2025, 14:56 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+