For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. నువ్వు ముసలివాడివి అయ్యావ్.. రిటైర్మెంట్ తీసుకో: మాజీ క్రికెటర్

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో అత్యంత పెద్ద వయస్కుడిగా ఉన్నాడు. 43 ఏళ్ల వయస్సులో కూడా ధోని సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. అయితే ధోని ప్రదర్శన ఇప్పుడు అంత బాగా లేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో సీఎస్కే13 మ్యాచ్‌లు ఆడి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ధోని ఆటతీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 17 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ధోని ప్రదర్శనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు.

ధోనిపై క్రిస్ శ్రీకాంత్ ఆగ్రహం
రాజస్థాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీని తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. "ధోని వయస్సు కూడా పెరుగుతోంది. ఆయన నుంచి ఎక్కువ ఆశించకూడదు. కానీ అదే సమయంలో ధోని పదే పదే వచ్చి ఆటను పాడు చేయకూడదు. మీరు చేయలేకపోతే దీన్ని చేయలేమని చెప్పి వెళ్లిపోండి. ఇది ధోని మాత్రమే తీసుకోగల నిర్ణయం. ధోని ఆడటం కొనసాగిస్తాడా, కొనసాగిస్తే ఏ పాత్రలో కెప్టెన్, వికెట్ కీపర్ లేదా ఫినిషర్ రాణించాలి." అంటూ సలహా ఇచ్చాడు.

IPL 2025 MS Dhoni Should Retire Now Says Kris Srikkanth After Poor Show

నిజం చెప్పాలంటే ధోనిలో చురుకుదనం తగ్గిపోయిందని క్రిస్ శ్రీకాంత్(కృష్ణమాచారి శ్రీకాంత్) అన్నాడు. ధోని మోకాలు బలహీనపడి ఉండవచ్చని, అతని ఫిట్‌నెస్, రిఫ్లెక్స్ స్థాయిలు ప్రతిదీ ఖచ్చితంగా తగ్గుతుందని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టుపై సీఎస్కే టాపార్డర్ విఫలమైందని.. ధోని తాను గతంలో ఆడినట్లుగా ఆడలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారని.. గతంలో ధోని స్పిన్నర్ల బంతులను స్టాండ్స్ లోకి తరలించేవాడని.. నిజం చెప్పాలంటే ధోని కష్టపడుతున్నాడని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

కేవలం 3 మ్యాచ్‌ల్లో‌నే గెలిచిన సీఎస్కే
ఈ సీజన్ ప్రారంభంలో సీఎస్కే కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్ చేతిలో ఉంది. ఆ తర్వాత గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించారు. సీఎస్కే ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తర్వాత జట్టు పరాజయం పాలవుతూనే ఉంది. బ్యాటింగ్‌లో సీఎస్కే అత్యంత నిరాశపరిచింది. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే కేవలం 3 మ్యాచ్‌‌ల్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ మే 25న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగనుంది.

Story first published: Wednesday, May 21, 2025, 14:32 [IST]
Other articles published on May 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+