For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni: సీఎస్కే 5 తప్పులివే..!!

IPL 2025 CSK: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే ఆటతీరు పేలవంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో మూడింటిలో పరాజయాన్ని అందుకుంది. పైగా అవి కూడా వరుస ఓటములు కావడం గమనార్హం. కాంబినేషన్ సెట్ కాకపోవడం, అంచనాలతో దిగిన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం సహా పలు కారణాలు సీఎస్కే ఓటమికి దారీ తీస్తున్నాయి. ఇప్పటికైతే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ 17 మంది ప్లేయర్లను ఆడించారు. అందులో దాదాపుగా అంతర్జాతీయ ఆటగాళ్లను, అనుభవం ఉన్న ప్లేయర్లను వినియోగించారు. కానీ సరైన ప్లేయింగ్ 11 సెట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఓటమికి గల 5 ప్రధాన కారణాలను తెలుసుకుందాం.

దెబ్బేసిన ఓపెనర్ల కాంబినేషన్..
టీ20ల్లో పవర్ ప్లే చాలా ముఖ్యం. తొలి ఆరు ఓవర్లలో వీలైనన్నీ పరుగులు చేస్తేనే.. బలమైన ఆరంభం ఉంటుది. జట్టు భారీ స్కోర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు సీఎస్కే జట్టులో ఓపెనింగ్ జోడీ సెట్ అవ్వట్లేదు. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరగగా అందులో రెండు ఓపెనింగ్‌ జోడీలను ఆడించారు. రచిన్ రవీంద్ర - రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర - రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర - రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర - డెవాన్ కాన్వే.. నాలుగు మ్యాచుల్లో ఓపెనింగ్ జోడీగా దిగారు. కానీ ఈ జోడీలు విఫలమైంది. మొదటి మూడు మ్యాచుల్లో రాహుల్‌ త్రిపాఠి (2,5,23) రాణించలేదు. స్ట్రైక్‌ రేట్‌ పెద్దగా లేదు. నాలుగో మ్యాచులో త్రిపాఠి బదులు డేవాన్ కాన్వేకు దింపగా .. అతడు కూడా విఫలమయ్యాడు. ఇక తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన రచిన్‌ (65, 41).. మూడు, నాలుగు మ్యాచుల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. సరైన ఓపెనర్లు లేకుంటే సీఎస్కే భారీ స్కోరు లేదా ఛేజింగ్‌ చేయడం కష్టమే.

IPL 2025 MS Dhoni retirement CSK Loss reasons from batting to bowling unit

మిడిలార్డర్ కూడా..
ఓపెనింగ్ లోనే కాడు మిడిలార్డర్ లోనూ సీఎస్కే ఇబ్బంది పడుతోంది. శివమ్‌ దూబెపై భారం ఎక్కువ పడుతోంది. అయినా అతడు (9, 19, 9, 18) కూడా విఫలమవుతున్నాడు. దీపక్‌ హుడా, సామ్‌ కరన్‌, విజయ్‌ శంకర్‌ కూడా నిరశపరుస్తున్నారు. అయితే దిల్లీతో జరిగిన మ్యాచులో విజయ్‌ శంకర్‌ బానే ఆడినా.. స్ట్రైక్‌ రేట్‌ తేడా కొట్టింది. జట్టు కోసం ముందుకొచ్చిన ధోనీ, ఇక రవీంద్ర జడేజా కూడా నిరాశపరుస్తున్నారు.


బౌలింగ్‌ తుస్సు..
భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన రవించంద్రన్‌ అశ్విన్‌ చేతులెత్తేశాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు వికెట్లే తీయగలిగాడు. భారీగా పరుగులిచ్చేశాడు. జడేజా కూడా అంతే. స్పిన్నర్ నూర్‌ అహ్మద్‌ ఇప్పటివరకు న్యాయం చేశాడు. పేసర్లలో మతీశా పతిరన బానే ప్రదర్శన చేస్తున్నాడు. మిడిల్‌ ఓవర్‌లో పరుగులిచ్చినా.. డెత్‌ ఓవర్లలో కట్టడి చేస్తున్నాడు. పవర్‌ ప్లేలో ఖలీల్‌ అహ్మద్‌ బానే రాణిస్తున్నాడు. కానీ మూడో పేసర్‌ విషయంలో సీఎస్కేకు సమస్య. జేమీ ఓవర్టన్‌, సామ్‌ కరన్‌, ముకేశ్‌ చౌదరిని ఆ స్థానంలో ట్రై చేయగా కుదరలేదు. ఇంకా మొత్తంగా చూస్తే చెన్నై ఓడిపోవడమే కాదు, ఓడిపోయినా మ్యాచుల్లోనూ దూకుడు కనిపించలేదు.రన్‌రేట్‌ తగ్గకుండా మాత్రం చూసుకుంటోంది. సరైనా ఫినిషర్ కూడా కనిపించడం లేదు. ధోనీ ఆ బాధ్యతను ఇంకా ఈ సీజన్ లో నెరవేర్చలేదు. ఇకపోతే ధోనీ రిటైర్మెంట్(Dhoni retirement) తీసుకుంటాడని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.
Story first published: Sunday, April 6, 2025, 13:05 [IST]
Other articles published on Apr 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+