Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేకు అన్యాయం?

IPL 2025: ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి పునరాగమనం వైపు పయనిస్తోంది. లీగ్ లోని 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్ లో 7 మ్యాచ్‌ల్లో సీఎస్కే సాధించిన రెండో విజయం ఇది. ఈ గెలుపు తర్వాత సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. జట్టు తరపున ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేయడం ద్వారా మ్యాచ్ ను ముగించాడు. ఇదిలా.. ఉండగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది.

నిజానికి ధోని కాకుండా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో ఉన్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, సీఎస్కే ఆటగాడు శివం దూబే ఉన్నారు. సాధారణంగా గెలిచిన జట్టు నుంచి మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ జట్టు ఓడిపోవడంతో పంత్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేయలేదని చెప్పవచ్చు. కానీ ఇక్కడ శివం దూబేకి అన్యాయం జరిగిందని పలువురు భావిస్తున్నారు.

IPL 2025 MS Dhoni Named Player of the Match Was Shivam Dube Unfairly Overlooked

43 పరుగులు చేసిన శివం దూబే
లక్నోతో జరిగిన మ్యాచ్ లో జట్టు 76 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయినప్పుడు శివం దూబే సీఎస్కే తరపున ఇన్నింగ్స్ ఆచితూచి నిర్మించాడు. ఇక్కడి నుంచి లక్నో బౌలర్లు పునరాగమనం చేశారు. కానీ శివం దూబే వచ్చిన వెంటనే ఫోర్లు, సిక్సర్లు కొట్టి సీఎస్కేను తిరిగి మ్యాచ్ లోకి తీసుకువచ్చాడు. దూబే ప్రణాళికబద్ధమైన ఇన్నింగ్స్ ఆడి 37 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు.

శివం దూబే బ్యాటింగ్ కు వచ్చినప్పుడు రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ వికెట్లు ముందుగానే పడిపోయాయి. సీఎస్కే కు క్లిష్ట పరిస్థితిలో శివం దూబే ఓపికగా బ్యాటింగ్ చేసి కెప్టెన్ ధోనికి మంచి సపోర్టును అందించాడు. జట్టు తరపున ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో పాటు ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ లో కొన్ని క్యాచ్‌లు పట్టుకున్నాడు. అద్భుతమైన స్టంపింగ్‌లతో పాటు రనౌట్ లు కూడా చేశాడు. బహుశా అందుకే ఎంఎస్ ధోనిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, April 15, 2025, 7:38 [IST]
Other articles published on Apr 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+