Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ధోనీ ఫిట్‌నెస్ అప్డేట్ - ఆ రోజే CSK క్యాంపులోకి ఎంట్రీ!

ఐపీఎల్ 2025 కోసం ధోనీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. గత సీజన్ లో మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న అతడు ప్రస్తుతం ఈ సీజన్ కోసం ఫుల్ ఫిట్ గా తయారయ్యాడట. త్వరలోనే అతడు సీఎస్కే ప్రీ సీజన్ క్యాంప్ లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం అందింది. ఈ విషయాన్ని ధోనీకి బాగా దగ్గరైన ఓ వ్యక్తి తెలిపారు.

ఆటగాడిగా కన్నా ఎక్కువగా..
ఐపీఎల్ 2025లో మహేంద్రసింగ్ ధోనీ ఆడనున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రూ.4 కోట్లకు దక్కించుకుంది. అతడు కెప్టెన్ గా వ్యవహరించకపోయినప్పటికీ జట్టులో అతడి క్రేజే ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీజన్ లో మహీ.. సీఎస్కే జట్టుకు ఓ ఆటగాడిగా కన్నా ఎక్కువని ధోనీకి సంబంధించిన ప్రతినిధి పేర్కొన్నారు. "ధోనీ ఫిబ్రవరి 25న చెన్నైకి వచ్చి జట్టుతో కలవనున్నారు. ఆయన చాలా కాలం నుంచి ఫారెన్ లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సీఎస్కేతో కలవనున్నారు." అని సదరు ప్రతినిధి తెలిపాడు.

IPL 2025 MS Dhoni completely fit and ready for IPL join in CSK camp on February 25

అలా చేయడం కరెక్ట్ కాదు..
ధోనీ గత సీజన్ లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఈ విషయం గురించి సదరు ప్రతినిధి మాట్లాడుతూ.. "ధోనీ ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నారు. ట్రైనింగ్ బాగా చేస్తున్నారు. ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. ప్రతీది చేస్తున్నారు. అలా అని మీరు 23 ఏళ్ల కుర్రాడి ఫిట్ నెస్ తో 43 ఏళ్ల వ్యక్తి ఫిట్ నెస్ ను పోల్చడం సరికాదు. అయినా కానీ ఎంతో మంది యువకుల కన్నా మహీ ఎన్నో రెట్లు ఎక్కువగా ఫిట్ గా ఉన్నారు." అని పేర్కొన్నాడు.

తొలి మ్యాచ్ ఎవరితో అంటే?
మార్చి 22నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ తో మార్చి 23న ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Story first published: Tuesday, February 18, 2025, 17:14 [IST]
Other articles published on Feb 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+