Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: నెం.1గా ఆర్సీబీ - అత్యధిక వ్యూస్ ఆ మ్యాచుకే!!

IPL 2025 Most Viewed Match: ఐపీఎల్ లో బడా జట్లు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ నాలుగు జట్లలో టైటిల్స్ పరంగా చూస్తే.. సీఎస్కే (5), ముంబయి (5), కేకేఆర్ (3) ముందు వరుసలో ఉన్నాయి. ఒక్క టైటిల్ కూడా సాధించకపోయినా క్రేజ్ పరంగా ఈ మూడు జట్లతో సమానంగా ఉంది ఆర్సీబీ. అదీ బెంగళూరు జట్టు ఘనత. వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆర్సీబీకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంటుంది. ఇటీవలే ఇన్ స్టాలోనూ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న జట్టుగానూ అవతరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 17.8 మిలియన్ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఆర్సీబీ మ్యాచులకే అత్యధిక వ్యూస్..
అయితే తాజాగా ఆర్సీబీ మరో ఘనత కూడా సాధించింది. ఐపీఎల్ 2025లో జియో హాట్ స్టార్‌లో ఆర్సీబీ ఆడిన మ్యాచులకే అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 41.7 కోట్లతో అత్యధిక వ్యూస్ అందుకున్న మ్యాచుగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే 37.4 కోట్లు, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ 34.7 కోట్లు వ్యూస్ దక్కించుకున్నాయి. అంటే ఈ మూడు మ్యాచుల్లోనూ ఆర్సీబీనే ఉండటం విశేషం.

IPL 2025 Most Viewed Match on JioHotstar is RCB Vs KKR match is 41 7cr

ఏఏ స్థానాల్లో ఉన్నాయంటే?
ప్రస్తుతం ఈ సీజన్ లో ఈ నాలుగు జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే (ఆర్సీబీ) మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆడిన ఐదింటిలో నాలుగింటిలో ఓడిపోయి 2 పాయింట్లతో 9వ స్థానంలో, ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆడిన ఐదింటిలో నాలుగింటిలో ఓడిపోయి 2 పాయింట్లతో 8వ స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆడిన ఐదింటిలో మూడింటిలో ఓడిపోయి 4 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాయి.

Story first published: Wednesday, April 9, 2025, 15:33 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+