Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS SRH: 'అతడు బానే ఉన్నాడు.. మీరు భయపడకండి!'

IPL 2025 MI VS SRH: ఐపీఎల్ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖెడె స్టేడియం వేదకగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఈ మ్యాచులో ఇరు జట్లు.. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

హార్దిక్ మాట్లాడుతూ.. "మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాం. వాంఖెడెలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం మంచిది. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. మేము మా వంతుగా పూర్తి బెస్ట్ ఇస్తాం. అదే మమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. మా జట్టులోని అందరూ బ్యాటర్లపై మాకు నమ్మకం ఉంది. ఇక బుమ్రా బాగానే ఉన్నాడు. బుమ్రా గురించి మాకు ఏలాంటి ఆందోళన అవసరం లేదు." అని అన్నాడు.

ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "పిచ్ బాగానే ఉంది. ఇదే జట్టుతో మేము బరిలోకి దిగుతున్నాం. అభిషేక్ ఇంకా హైలైట్స్ ఆడాలని చూస్తున్నాడేమో అనిపిస్తోంది. ప్రాక్టీస్ బాగా చేశాం. రివర్స్ స్వింగ్ పెద్దగా ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. కొన్ని వేదికలపైనే అది సాధ్యం అవుతుంది. హైదరాబాద్‌లో పరిస్థితులు చాలా డ్రైగా ఉంటాయి. టోర్నమెంట్ ముందుకెళ్లేకొద్దీ డ్యూ ప్రభావం పెరుగుతుంది కాబట్టి రివర్స్ స్వింగ్ సాధ్యపడటం కష్టమే." అని అన్నాడు.

IPL 2025 MI VS SRH Hardik Pandya says Bumrah is fine and dont need to worry

సన్ రైజర్స్ తుది జట్టు ఇదే
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమి, ఎషాన్ మలింగ

ముంబయి ఇండియన్స్ తుది జట్టు
రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ శర్మ

ఇరు జట్ల ఇంపాక్ట్ సబ్స్ వీరే
ముంబయి: రోహిత్ శర్మ, కోర్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ భావా, రాబిన్ మింజ్
సన్ రైజర్స్: అభినవ్ మనోహర్, జయేవ్ ఉనద్కత్, సచిన్ బేబి, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్

Story first published: Thursday, April 17, 2025, 19:19 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+