Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మెగా వేలం ముహుర్తం ఖరారు.. బరిలోకి 1574 క్రికెటర్లు!

ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు (76) ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల ఆయా ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ లిస్ట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. పది ఫ్రాంచైజీలు 46 మందిని అట్టిపెట్టుకున్నాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకున్నాయి. పంజాబ్ కింగ్స్ ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది.

IPL 2025 Mega Auction Set for November 24-25 in Jeddah

ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లతో జట్టును నిర్మించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 204 స్లాట్లకు వేలం జరగనుంది. ఇందులో 70 ఓవర్సీస్ ప్లేయర్లకు అవకాశం ఉంది. కాగా, ప్రతి ఫ్రాంచైజీకి రూ.120 కోట్లు కేటాయించగా, రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.50 కోట్లు ఉన్నాయి. అతి తక్కువగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.

ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ, ఆర్‌టీఎమ్ కార్డ్స్, కావాల్సిన ఆటగాళ్ల సంఖ్య

చెన్నై సూపర్ కింగ్స్- రూ. 55 కోట్లు (ఆర్‌టీఎమ్- 01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-07)
ముంబై ఇండియన్స్- రూ. 45 కోట్లు (ఆర్‌టీఎమ్- 01)- 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-08)
కేకేఆర్- రూ. 51 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -06)
రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
ఎస్‌ఆర్‌హెచ్- రూ. 45 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -05)

గుజరాత్ టైటాన్స్-రూ. 69 కోట్లు (ఆర్‌టీఎమ్-01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
ఆర్‌సీబీ-రూ. 83 కోట్లు (ఆర్‌టీఎమ్-03)- 22 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
ఢిల్లీ క్యాపిటల్స్-రూ.73 కోట్లు (ఆర్‌టీఎమ్-02)- 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
పంజాబ్ కింగ్స్-రూ. 110.5 కోట్లు (ఆర్‌టీఎమ్-04)- 23 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
లక్నో సూపర్ జెయింట్స్-రూ. 69 కోట్లు (ఆర్‌టీఎమ్-01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)

Story first published: Wednesday, November 6, 2024, 7:55 [IST]
Other articles published on Nov 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+