Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: స్టార్ బౌలర్‌కు గాయం.. ఐపీఎల్ నుంచి ఔట్

IPL 2025: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు. మంచి స్పీడ్‌తో అందరినీ ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2025లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మయాంక్ యాదవ్‌కు వెన్ను గాయమైందని.. మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడని ఐపీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కూడా గురువారం ధ్రువీకరించింది. మయాంక్ యాదవ్ స్థానంలో విలియమ్ ఒరూర్క్(న్యూజిలాండ్)ను జట్టులోకి తీసుకుంది. ఒక్క ఏడాదిలోనే మయాంక్ యాదవ్ గాయపడడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మయాంక్ యాదవ్ ఈ ఏడాది సీజన్ మధ్యలోనే గాయం నుంచి కోలుకుని లక్నో జట్టులో చేరాడు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఈవో) స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలు 6 నెలలు ఉండి కోలుకున్న మయాంక్ యాదవ్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మయాంక్ స్పీడ్ కూడా తగ్గింది. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ యాదవ్‌కు వెన్నుగాయం తిరగబెట్టింది. మయాంక్ మళ్లీ బెంగళూరులోని ఎన్సీఏకు వెళ్లనున్నాడు. మయాంక్ యాదవ్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో అతడి క్రీడా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. మయాంక్ యాదవ్ స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లక్నో తరఫున ఆడనున్నాడు.

IPL 2025 Mayank Yadav Injured Again Ruled Out William O Rourke Joins LSG Squad

న్యూజిలాండ్ పేసర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.3 కోట్ల రిజర్వ్ ధరకు సొంతం చేసుకుంది. విలియం ఒరూర్క్ కివీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. విలియం ఒరూర్క్ భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో ఒరూర్క్ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Friday, May 16, 2025, 7:56 [IST]
Other articles published on May 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+