Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG Retention List: రాహుల్‌పై వేటు-కుర్రాళ్లకు బంపరాఫర్..రిటైన్ లిస్ట్ ప్రకటించిన లక్నో

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను వెల్లడిస్తోంది. ఊహించనట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ పదునైన వ్యూహాలతో అయిదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది.

కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వలేదు. వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాలతో రాహుల్ కూడా ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. కాగా, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు రూ. 21 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌ల అనుభవమే ఉన్న మయాంక్ యాదవ్‌కు రూ.11 కోట్లు ఒప్పందంతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఆయుష్ బదోని, మోహ్షిన్ ఖాన్‌లను కూడా అట్టిపెట్టుకుంది.

IPL 2025 Lucknow Super Giants Retained and Released Players KL Rahul Out Pooran Retained for 21 Crore

లక్నో సూపర్ జెయింట్స్ రిటెన్షన్ లిస్ట్:
నికోలస్ పూరన్- రూ.21 కోట్లు
రవి బిష్ణోయ్- రూ.11 కోట్లు
మయాంక్ యాదవ్- రూ.11 కోట్లు
మోహ్షిన్ ఖాన్- రూ.4 కోట్లు
ఆయుష్ బదోని- రూ.4 కోట్లు

రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ.41 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 69 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టొయినిస్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రెరాక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, ఆస్టన్ టర్నర్, సిద్ధార్థ్, యుద్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అర్షిన్ కులకర్ణి

Story first published: Thursday, October 31, 2024, 18:13 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+