For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: లక్నో ఓటమితో ముంబైకి జాక్‌పాట్?

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టును దారుణంగా ఓడించింది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అర్థ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లను కలిగి ఉంది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానంలో ఎటువంటి మార్పు లేదు. వారు ఇప్పటికీ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఖచ్చితంగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కాస్త మార్పు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వల్ల ముంబై ఇండియన్స్ ఎక్కువగా లాభపడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి మ్యాచ్‌లో ఓటమి కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ మైనస్‌కి పడిపోయింది. లక్నో5వ స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే ఈ రోజు ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ ప్లస్ లో ఉంది. కాబట్టి ఈ రోజు గెలిస్తే ముంబై జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుంది.

IPL 2025 Lucknow s Defeat Turns Jackpot for Mumbai Indians

నికర రన్ రేట్ పరంగా మెరుగుగా ముంబై ఇండియన్స్
నికర రన్ రేట్ పరంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది. దాని నికర రన్ రేట్ +0.483 కాగా.. పంజాబ్ కింగ్స్ +0.177, మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నికర రన్ రేట్ +0.472గా ఉంది. అద్భుతమైన విజయాలతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసులో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్, వారి పేలవమైన వ్యూహానికి బలి అవుతున్నట్లు కనిపిస్తోంది.

ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఢిల్లీకి కేవలం రెండు విజయాలు మాత్రమే అవసరం!
మంగళవారం జరికగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లక్నో జట్టు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ లక్నో జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ సునాయాసంగా విజయాన్ని సాధించింది. ఢిల్లీ మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం.

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక

Story first published: Wednesday, April 23, 2025, 15:10 [IST]
Other articles published on Apr 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+