Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: వేలంలోకి కేఎల్ రాహుల్‌.. LSG రిటైన్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.

నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది.

IPL 2025 LSG Yet to Decide on KL Rahul s Captaincy Amid Retention of Key Players

గడువుకు మరో రెండు వారాల సమయమే ఉండటంతో కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను దాదాపుగా సిద్ధం చేశాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌‌ను అట్టిపెట్టుకోవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలా లేదా ఆర్‌టీఎమ్ కార్ద్ ద్వారా దక్కించుకోవాలా అనే సందిగ్ధతలో ఫ్రాంచైజీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఆయుష్ బదోని, మెహ్సిన్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని లక్నో ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. అలాగే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను కూడా అట్టిపెట్టుకోనుంది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మోహ్సిన్, రైట్ హ్యాండెడ్ హిట్టర్ ఆయుష్ బదోని 2022 నుంచి లక్నో ఫ్రాంచైజీతో కొనసాగుతున్నారు. ఇక స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్‌ విషయంలోనూ ఫ్రాంచైజీ అయోమయంలో ఉంది. రిటైన్ లేదా ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తోంది.

కాగా, గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ అనంతరం ఓటమిపై రాహుల్‌ను ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లక్నో ఫ్రాంచైజీతో రాహుల్ గల సంబంధాలు బలహీనపడ్డాయని వార్తలు వచ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌ను వేలంలోకి పంపి తిరిగి దక్కించుకోవాలని చూస్తే లక్నో పెద్ద మొత్తంలో రూ.కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాహుల్‌ కోసం వేలంలో ఆర్సీబీ తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ లిస్ట్ (అంచనా)
ఆయుష్ బదోని, మోహ్సిన్ ఖాన్, నికోలస్ పూరన్, మాయంక్ యాదవ్, కేఎల్ రాహుల్.

Story first published: Thursday, October 17, 2024, 15:50 [IST]
Other articles published on Oct 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+