Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: మ్యాచ్ మలుపు తిప్పింది 'అతడే'.. ది అన్‌సంగ్ హీరో!

విజయ లక్ష్యం 204 పరుగులు.. నమన్, సూర్యకుమార్‌ చెలరేగడంతో గెలుపు సునాయాసంగానే అనిపించింది. చివర్లో విజయానికి 2 ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా, హార్దిక్‌ పాండ్యా కొట్టగలడని అనిపించింది. కానీ చివరికి లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60 పరుగులు), అయిడెన్ మరక్రమ్ (38 బంతుల్లో 53 పరుగులు) లక్నోకు బలమైన పునాది వేయడం, డెత్ ఓవర్లలో శార్దూల్, ఆవేశ్ ఖాన్ పదునైన బౌలింగ్ వేయడంతో పాటు స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే సమర్పించుకోవడంతో ఉత్కంఠ పోరులో విజయం లక్నోకు వరించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ సెట్ చేసిన హార్దిక్ బ్రిలియంట్ స్పెల్ 5/36 మాత్రం వృథా అయిపోయింది. ముంబయి గెలిచేందుకు దోహద పడలేదు. ఫలితంగా హోం గ్రౌండ్ లో లక్నో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ ను 12 పరుగులు తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లింది.

ఈ మ్యాచులో మోస్ట్ వ్యాలుబుల్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఈ మ్యాచులో తన బ్రిలియంట్ ఎకానమికల్ స్పెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు దిగ్వేశ్ సింగ్ రథి. అతడు 4-21-1 బౌలింగ్ ఫిగర్స్ మ్యాచ్ ఫలితంపై గట్టి ప్రభావం చూపింది. కానీ మోస్ట్ వ్యాలుబుల్ ప్లేయర్ గా మాత్రం శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఎందుకంటే ఛేదనలో తీవ్ర ఒత్తిడిలోనూ అతడి నమోదు చేసిన 4-40-1 బౌలింగ్ ఫిగర్సే మ్యాచ్ మలుపు తిప్పింది. చివరి ఓవర్లలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. 19 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వత ఆఖరి ఓవర్ లో పదునైన బౌలింగ్ తో ఆవేశ్ ఖాన్ 9 పరుగులే సమర్పించుకున్నాడు.

IPL 2025 LSG vs MI Match turning point Shardul thakur was the Most Valuable Player

దీంతో లక్నో విజయాన్ని అందుకుంది. రథి, ఠాకూర్, ఆవేశ్ ఖాన్ తో పాటు బ్యాటర్లు దంచికొట్టడంతో లక్నోగెలుపు సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా డెత్ బౌలింగ్ లక్నోకు విజయమెట్టుపై కూర్చొపెట్టింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానానికి వెళ్లిపోయింది. కాగా, లక్నో తన తర్వాతి మ్యాచును ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్స్ వేదికాగా కేకేఆర్ జట్టుతో తలపడనుంది. ముంబయి ఇండియన్స్ ఏప్రిల్ 7న వాంఖెడె స్టేడియంలో ఆర్సీబీతో పోటీపడనుంది.

Story first published: Saturday, April 5, 2025, 8:03 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+